‘బాహుబలి-2’ ని బీట్ చేయబోతున్న ‘కె.జి.ఎఫ్’..?

సౌత్ సినిమా స్థాయి ఏంటనేది ‘కె.జి.ఎఫ్’ చిత్రం మరోసారి నిరూపించింది. ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయి విజయం సాధించిన చిత్రాల్లో ఒక కన్నడ సినిమా ఉండడం ఇదే మొదటిసారి కావడం విశేషం. విడుదలైన అన్ని భాషల్లోనూ పోటీ చిత్రాలు ఉన్నప్పటికీ ‘కె.జి.ఎఫ్’ చిత్రం మంచి కలెక్షన్స్ ని రాబట్టి ట్రేడ్ కి సైతం షాకిచ్చింది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 200 కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది.

ఇక కొన్ని ఏరియాల్లో అయితే ‘బాహుబలి 2’ రికార్డుల దగ్గరకు చేరుకోవడం విశేషం. ముఖ్యంగా కన్నడలో ‘బాహుబలి 2’ కలెక్షన్స్ ను అందుకోవడానికి చాలా దగ్గర్లో ఉంది. ‘బాహుబలి 2’ చిత్రం కర్ణాటకలో 129 కోట్లను వసూలు చేయగా ‘కె.జి.ఎఫ్’ చిత్రం 125 కోట్ల గ్రాస్ ను రాబట్టి ‘బాహుబలి2’ కలెక్షన్స్ ను అధిగమించడానికి రెడీ అవుతుంది. మొదట ఈ చిత్రానికి నెగిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ… డైరెక్టర్ రాజమౌళి స్థాయిలో హీరోని ఎలివేట్ చేసిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీనితో రికార్డు కలెక్షన్లతో క్రిటిక్స్ కి సైతం షాకిచ్చింది. బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ చిత్రం ‘జీరో’ ఉన్నప్పటికీ… దాదాపు 50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 25 కోట్లను వసూలు చేసి బయ్యర్స్ కు మంచి లాభాలను ఇచ్చింది. ఇక తరువాత రాబోయే ‘కె.జి.ఎఫ్ ఛాప్టర్ 2’ చిత్రాన్ని ఇంకా భారీగా తెరకెక్కించేందుకు దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. మరి ఈ చిత్రం మరిన్ని అద్భుతాలు చేస్తుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus