దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలో పాదయాత్ర అంశాన్ని తీసుకుని ‘యాత్ర’ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు మహి వి రాఘవ్. 2019 ఫిబ్రవరి 8 న అంటే సరిగ్గా 5 ఏళ్ళ క్రితం ఆ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమా క్రిటిక్స్ నుండి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకుంది. ఏపీ ఎన్నికల బరిలో నిలిచిన వైసీపీ పార్టీకి మంచి మైలేజ్ అందించింది. 5 ఏళ్ళ తర్వాత సరిగ్గా అదే రోజు అంటే 2024 ఫిబ్రవరి 8 న ‘యాత్ర’ కి సీక్వెల్గా రూపొందిన ‘యాత్ర 2’ ని విడుదల చేశాడు దర్శకుడు మహి వి రాఘవ్.
మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.కానీ రెండో రోజు నుండీ డౌన్ అయ్యాయి. మొదటి సోమవారం నాడు ఈ మూవీ పెద్దగా కలెక్ట్ చేసింది అంటూ ఎక్కువ లేదు. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
0.43 cr
సీడెడ్
0.70 cr
ఆంధ్ర(టోటల్)
0.47 cr
ఏపీ + తెలంగాణ
1.60 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.32 cr
ఓవర్సీస్
0.38 cr
వరల్డ్ వైడ్ టోటల్
2.30 cr
‘యాత్ర 2’ (Yatra2) చిత్రం రూ.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.2.15 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.5.7 కోట్ల షేర్ ను రాబట్టాలి. వీక్ డేస్ లో ఈ మూవీ నిలదొక్కుకుంటే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ కనిపించడం లేదు.