Allu Arjun: అల్లు అర్జున్ హైట్ పై యంగ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్..!

Advertisement

అల్లు అర్జున్ టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోల్లో ఒకరు. అయితే ‘అల వైకుంఠపురములో’ చిత్రం వరకు ‘అల్లు అర్జున్.. ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ ఇచ్చినా అతను పక్కింటి అబ్బాయి వంటి పాత్రలకే సరిపోతాడు’ అనే అభిప్రాయం అందరిలోనూ ఉండేది. కానీ ‘పుష్ప’ తో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. దీనికి భీభత్సమైన హిట్ టాక్ అయితే ఏమీ రాలేదు. తెలుగు రాష్ట్రాల్లో అబౌవ్ యావరేజ్ అనే రేంజ్లోనే ఆడింది. కానీ మిగిలిన అన్ని భాషల్లోనూ ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.

ముఖ్యంగా హిందీలో ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ‘పుష్ప 2’ పై అక్కడ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అది అల్లు అర్జున్ రేంజ్..! అయితే ఓ యంగ్ హీరోయిన్ గతంలో అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె మరెవరో కాదు అశ్విని శ్రీ. ‘బిగ్ బాస్ 7’ లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

అంతకు ముందు ‘వినోదం 100 పర్సెంట్’ ‘బి టెక్ బాబులు’ ‘నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అలాగే పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’, మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేసింది.గతంలో ఈమె ఓ ఇంటర్వ్యూ అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా అవకాశం వస్తే చేస్తారా? అని ప్రశ్నించగా.. ‘నా హైట్ కి ప్రభాస్ వంటి హీరోలు సెట్ అవుతారు. అల్లు అర్జున్ అయితే స్టాండ్ వేసుకోవాలి’ అంటూ కామెంట్ చేసింది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read