Kajal: కాజల్ ని నమ్ముకున్నాడు.. పనవుతుందా..?

  • April 23, 2022 / 01:15 PM IST

ఇండస్ట్రీలో సినిమా ఛాన్స్ దక్కించుకోవడానికి టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు.. అన్నీ కలిసి రావాలి. అలా కలిసిరాక ఓ దర్శకుడు ఇబ్బంది పడుతున్నాడు. కాజల్ తో సినిమా ఓకే చేయించుకున్న ఓ యంగ్ డైరెక్టర్ ఇప్పుడు ఆమె ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తుందో అర్ధంకాక సతమతమవుతున్నాడు. ‘పేపర్ బాయ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు జయశంకర్. ఈ సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చింది. సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటించారు.

Click Here To Watch NOW

దీని తరువాత దర్శకుడు జయశంకర్ ఓ లేడీ ఓరియెంటెడ్ కథ రాసుకున్నారు. ఆ కథను స్టార్ హీరోయిన్ కాజల్ కి వినిపించారు. ఫస్ట్ సిట్టింగ్ లోనే ఆమె కథను ఓకే చేసింది. వెంటనే కాల్షీట్స్ కూడా ఇచ్చింది. సినిమా కూడా ఫార్మల్ గా లాంచ్ అయింది. అయితే అంతలోనే లాక్ డౌన్ పడింది. ఆ గ్యాప్ లోనే కాజల్ తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. ఆ వెంటనే పెళ్లి కూడా చేసుకుంది. ఈలోగా ఇతర సినిమాలతో బిజీ అయింది.

ఆ తరువాత ప్రెగ్నెంట్ కావడం, బాబుకి జన్మనివ్వడం తెలిసిందే. ఇలా మూడేళ్లు కరిగిపోయాయి. మళ్లీ కాజల్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో.. ఈ దర్శకుడి సినిమా ఎప్పుడు పూర్తి చేస్తుందో చెప్పలేని పరిస్థితి. చిన్న చిన్న సినిమాలు తీసిన దర్శకులు కూడా రెండు, మూడు సినిమా అవకాశాలు పట్టేస్తున్నారు. దర్శకుడు జయశంకర్ మాత్రం అదే సబ్జెక్ట్ తో మరో టాప్ హీరోయిన్ ను అప్రోచ్ అయ్యారు.

అలానే మరో సబ్జెక్ట్ తో ఓ మిడ్ రేంజ్ హీరోను కూడా లైన్ లో పెట్టాడు. కానీ ఇవన్నీ ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ అనసూయ లీడ్ రోల్ లో ఓ ఆంథాలజీ చేస్తున్నారు. ఆయన ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. మరి దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus