రాహుల్ రవీంద్రన్, చిన్మయి శ్రీపాద… వీరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకరు నటుడిగా, దర్శకుడిగా తెలిస్తే.. ఇంకొకరు గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పరిచయం. మీటూ ఉద్యమం ద్వారా ఆమె మరికొంతమంది సుపరిచితం. ఈ ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారనే విషయం తెలిసిందే. అయితే ప్రేమ సమయంలో ఏం జరిగింది, పెళ్లి సమయంలో ఏం జరిగింది అనే విషయాలను ఇటీవల ఓ షోలో చెప్పుకొచ్చారు.
వెన్నెల కిశోర్ వ్యాఖ్యాతగా ఓ టీవీ ఛానల్లో వస్తున్న ‘అలా మొదలైంది’ టాక్ షోలో ఈ విషయం చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో రాహుల్ తన ప్రేమకథ గురించి చెప్పారు. డబ్బింగ్ చేస్తుంటే ఈ అబ్బాయి ఎవరో క్యూట్‌గా ఉన్నాడు కదా అని చిన్మయికి అనిపించిందని రాహుల్ చెప్పాడు. ఆ విషయం ఆమె పెళ్లి తర్వాత తనకు చెప్పింది అని కూడా చెప్పాడు. అయితే ఇదంతా జరగలేదు అన్నట్లుగా చిన్మయి రియాక్ట్ అయ్యింది.
అసలే పెళ్లే వద్దనుకున్నాను అని చిన్మయి చెబుతుంటే ‘‘నేను ఆమెను కలిసేముందు పెళ్లి వద్దనుకున్నాను’’ అని రాహుల్ అన్నాడు. అయితే హీరో సందీప్ కిషన్ వల్ల ఇద్దరూ కలిశారని తెలిపారు. నువ్వు రాహుల్‌ను కలవాలి అని చెప్పి..” అని సందీప్ అడిగాడట. ఇదంతా జరుగుతున్నప్పుడు ‘‘సందీప్ నా కోసం అక్కడ మార్కెటింగ్ చేస్తున్నాడు’’ అని రాహుల్ అన్నాడు. ఈ మాటకు వెన్నెల కిషోర్ రియాక్ట్ అవుతూ ‘‘మార్కెటింగ్ చేయడంలో సందీప్ కిషన్ ది వేరే లెవల్’’ అని జోకేశాడు.
చిన్మయి (Chinmayi) ప్రసవం సమయంలో ‘‘నువ్వు పాడమ్మా అని.. ఆమె పాడుతుంటే డాక్టర్లు ప్రసవం చేశారట. ఆ సమయంలో ఆల్ మోస్ట్ నేను కళ్లు తిరిగి పడిపోయాను అని రాహుల్ చెప్పాడు. తమ పాపను నా చేతిలో పెట్టగానే చూస్తూ అలా ఉండిపోయా అని ఆ మధుర క్షణాలను గుర్తు చేసుకున్నాడు రాహుల్.