నాగచైతన్యతో గొడవకు సిద్ధమైన హీరో!

“యుద్ధం శరణం” సినిమాలో యువ సామ్రాట్ నాగ చైతన్యతో హీరో శ్రీకాంత్ తలపడ్డారు. ఈ మూవీతో విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మరో హీరో చైతూ సినిమాతో విలన్ గా మారబోతున్నారు. అతనే చాకోలెట్ బాయ్ గా అందరూ ముద్దుగా పిలుచుకునే మాధవన్. సఖి సినిమా హీరోగా అడుగుపెట్టి అమ్మాయిల మనసులు గెలుచుకున్న నటుడు విభిన్న కథలను ఎంచుకొని విజయాలను అందుకున్నారు. తాజాగా నెగిటివ్ రోల్ కి సై చెప్పారు.  ప్రేమమ్ వంటి హిట్ ఇచ్చిన చందూ మొండేటి తో నాగ చైతన్య  “సవ్యసాచి” అనే సినిమాని చేస్తున్నారు.

టైటిల్, ప్రీ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమాలో మాధవన్ విలన్ గా నటించనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. పాజిటివ్ రోల్స్ తో ఇంతవరకు మెప్పించిన మాధవన్ నెగిటివ్ రోల్లో ఎలా ఆకట్టుకుంటారోనని అందరిలో ఆసక్తి నెలకొంది.  మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకోనున్న ఈ మూవీ అక్టోబర్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus