టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో మోస్ట్ వాంటెడ్ ఎవరు అంటే.. శ్రీలీల అని ఠక్కున చెప్పేస్తారు సినీ జనాలు. ఎందుకంటే కొత్త సినిమా టాలీవుడ్‌లో మొదలవుతోంది అంటే ఈ భామ వైపు చూసే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఈ అమ్మడు వరుస సినిమాలకే ఓకే చెప్పేస్తోంది. అయితే దాని వల్ల ఓ యువ హీరోతో శ్రీలీల మాటలు పడిందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ సోషల్ మీడియా వర్గాలు. ఓ సినిమా నుండి తప్పుకున్నందుకు శ్రీలీల విషయంలో ఆ హీరో సీరియస్ అయ్యారట.
శ్రీలీల సినిమాల లెక్క సరిగ్గా తేలకపోయినా.. పెద్ద హీరోల సినిమాలు వరుసలో ఉన్నాయనే చెప్పాలి. నందమూరి బాలకృష్ణ సినిమాలో కూతురుగా నటిస్తోంది. అయితే ఈ పాత్ర బాలయ్య పాత్రకు సమానంగా ఉంటుంది అనే అంటున్నారు. ఆ తర్వాత మహేష్‌బాబు, అల్లు అర్జున్, తారక్ అంటూ చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఇవన్నీ నిజమయ్యే సూచనలూ కనిపిస్తున్నాయి అంటున్నారు. ఆమె రవితేజతో నటించిన ‘ధమాకా’ సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ‘పెళ్లిసందD’ సినిమాలో ఆమె లుక్స్‌కి కుర్రకారుతోపాటు ‘ధమాకా’ టీమ్ కూడా ఫిదా అయ్యి ఈ సినిమా ఛాన్స్ ఇచ్చిందని టాక్.
అలాగే మరికొంతమంది కుర్ర హీరోలు కూడా శ్రీలీలను సినిమాల్లోకి తీసుకున్నారు. అందులో ఓ సినిమా నుండి శ్రీలీల తప్పుకుందట. దాంతో ఆ హీరో కోపంతో ఫోన్ చేసి చెడామడా తిట్టేశాడు అంటున్నారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా ఈ సినిమా నుండి తప్పుకోవాలనుకుంటున్నాను అని శ్రీలీల చెప్పుకొచ్చిందట. అయినప్పటికీ అసలు కారణం అది కాదని, కావాలనే సినిమా నుండి తప్పుకున్నావు అని ఆమె మీద కోప్పడ్డాడట.
శ్రీలీల కన్‌ఫామ్‌గా ఓకే చేసి చేస్తున్న సినిమాలు అయితే నవీన్ పొలిశెట్టిది ఒకటి కాగా, రెండోది గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటిది. ఇది కాకుండా ఇంకేదైనా సినిమా ఓకే చేసి అనౌన్స్‌మెంట్ అవ్వకుండా ఉంటే ఉండొచ్చు. మరి శ్రీలీలను నిజంగా ఓ యువ హీరో అలా అన్నారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!