Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • March 27, 2026 / 11:02 AM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Youth Review in Telugu: యూత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • కెన్ కరునాస్ (Hero)
  • అనిష్మ అనిల్ కుమార్,ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ (Heroine)
  • దేవదర్శిని చేతన్,సూరజ్ వెంజరముడు తదితరులు (Cast)
  • కెన్ అండ్ గ్యాంగ్ (Director)
  • కరుపయ్య సి.రామ్, సులోచన కుమార్ (Producer)
  • జీవీ ప్రకాష్ కుమార్ (Music)
  • వికి (Cinematography)
  • నాష్ (Editor)
  • Release Date : మార్చి 26 2026
  • ఈ2సీ టాకీస్ (Banner)

ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘అసురన్’ ‘సార్’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కెన్ కరునాస్ ఫుల్ లెంగ్త్ హీరోగా నటించిన యూత్ఫుల్ మూవీ ‘యూత్’. మార్చి 19న తమిళంలో రిలీజ్ అయ్యి కమర్షియల్ సక్సెస్ అందుకున్న ఈ చిత్రాన్ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘దురంధర్ 2’ వంటి పెద్ద సినిమాలు ఉండటంతో తెలుగులో ఒక వారం ఆలస్యంగా విడుదల చేశారు. మరి తెలుగు ఆడియన్స్ ని కూడా ఈ సినిమా అలరించే విధంగా ఉందా? లేదా? తెలుసుకుందాం రండి:

Youth Movie Review

Youth Movie Review and Rating

కథ: ప్రవీణ్(కెన్ కరునాస్) ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు. ఇతని తండ్రి(సూరజ్ వెంజరముడు) ఓ బేకరీ షాప్ ఓనర్. తల్లి సరోజ( దేవదర్శిని) అతి గారాభం వల్ల అలాగే తండ్రి అతి జాగ్రత్త వల్ల ప్రవీణ్ బాధ్యత లేకుండా పెరుగుతాడు. టెన్త్ క్లాస్ అతి కష్టం మీద పాసైన ప్రవీణ్.. ఇంటర్ పూర్తయ్యేలోపు తన జెన్యూన్ లవ్ ను(ప్రియురాలు) సంపాదించుకోవాలని పరితపిస్తాడు. ఈ క్రమంలో ప్రషీకతో(మీనాక్షి దినేష్) అతనికి పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు. అయితే ఒకసారి ఆమె వేరే ఊరు వెళ్తుంది. ఈ క్రమంలో ప్రవీణ్ కి అనుకోకుండా సోనాల్ తో(ప్రియాన్షి యాదవ్) పరిచయం ఏర్పడుతుంది. ఆమె ఇతన్ని ప్రేమిస్తుంది.

ప్రవీణ్ కి సోనాల్ ప్రపోజ్ చేసినప్పటికీ.. ప్రషీక కారణంగా అతను యెస్ చెప్పలేకపోతాడు. ఒకరోజు సోనాల్ కి నిజం చెప్పబోయి ప్రషీక కంటబడతాడు ప్రవీణ్. దీంతో ఆమె ఇతనికి బ్రేకప్ చెప్పేస్తుంది. అటు తర్వాత తన క్లాస్మేట్ గీతతో(అనిష్మ అనిల్ కుమార్) అనుకోకుండా ప్రేమలో పడతాడు ప్రవీణ్. కానీ ఆమెకు ప్రవీణ్ పై అటువంటి ఫీలింగ్స్ ఉండవు. అయితే ఆమె కారణంగా ప్రవీణ్ కాలేజీలో కొంతమంది స్టూడెంట్స్ తో గొడవపడతాడు. ఈ గొడవ వల్ల అతనికి ప్రిన్సిపాల్ టీసీ ఇచ్చేసే రేంజ్ కి వెళ్తుంది విషయం. ఆ తర్వాత ప్రవీణ్ జీవితం ఏమైంది? ప్రవీణ్ కారణంగా అతని తల్లిదండ్రులకు ఎదురైన సమస్యలు ఏంటి? అనేది మిగిలిన కథ.

Youth Movie Review and Rating

నటీనటుల పనితీరు: ఈ విభాగంలో ముందుగా హీరో తండ్రి పాత్ర చేసిన సూరజ్ వెంజరముడు గురించి చెప్పుకోవాలి.తన పాత్రలో ఒదిగిపోయాడు. భార్యని పుట్టింటికి తీసుకెళ్ళే సన్నివేశంలో అలాగే భార్య చావుబ్రతుకుల మధ్య ఉన్నప్పుడు బాధతో కొడుకుపై చెయ్యి చేసుకునే సన్నివేశంలో కానీ జీవించేశాడు అని చెప్పాలి. అంత నేచురల్ గా చూపించి క్లైమాక్స్ లో కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు వెంటనే కరిగిపోవడం అనేది కొంచెం రియాలిటీకి దూరంగా అనిపిస్తుంది. ఇక హీరోగా చేసిన కెన్ తన సహజ నటనతో మంచి మార్కులు వేయించుకున్నాడు. తల్లి పాత్రలో దేవదర్శిని కూడా బాగా చేసింది. చెప్పుకోడానికి ముగ్గురు హీరోయిన్లు ఉన్నా ఒక్కరి నటన కూడా ఇంపాక్ట్ ఫుల్ గా అనిపించదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు.

Youth Movie Review and Rating

సాంకేతికవర్గం పనితీరు: యూత్ఫుల్ లవ్ స్టోరీస్ కి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కాకపోతే మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకోవాలి. ఈ విషయంలో హీరో ప్రదీప్ రంగనాథన్ ఓ బెంచ్ మార్క్ సెట్ చేశాడు. న్యూ ఏజ్ లవ్ స్టోరీస్ కి, యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ కు అతను సినానిమ్ అయిపోయాడు. హీరో కమ్ దర్శకుడు కెన్ పూర్తిగా ప్రదీప్ రంగనాథన్ స్టైల్ ఫాలో అయిపోయి ఈ ‘యూత్’ ని తీర్చిదిద్దిన ఫీలింగ్ అడుగడుగునా కలుగుతుంది. ‘హీరో అల్లరి చిల్లరిగా తిరగడం.. అమ్మాయిలతో ప్రేమలో పడటం.. నాశనమైపోతున్నాడు అనుకునే టైంలో మేల్కొని వాస్తవానికి దగ్గరగా ఆలోచించి కెరీర్లో సక్సెస్ సాధించడం’ వంటివి ప్రదీప్ రంగనాథన్ ‘డ్రాగన్’ సినిమాలో చూసినవే కదా. అందుకే ‘యూత్’ సినిమా కంటెంట్ పరంగా ఎక్కడా కొత్తగా ఉండదు. కానీ హీరో అండ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ చేసే కామెడీ కొంతవరకు నవ్విస్తుంది.

అలాగే ఈ సినిమాలో ప్రభాస్ రిఫరెన్సులు చాలా ఉంటాయి. ఛాన్స్ దొరికిన ప్రతిసారి ప్రభాస్ పేరు తీసుకురావడం, అతని పాత సినిమాల్లోని పాటలు వాడటం వంటివి చేశాడు దర్శకుడు. అంతేకాదు సీనియర్ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ పాత సినిమాల్లోని పాటల్ని కూడా వాడాడు.ఇలాంటి ఎలిమెంట్స్ బాగున్నప్పటికీ రీల్ కంటెంట్ చూసిన ఫీలింగ్ వస్తుంది తప్ప.. కథకి సింక్ అయ్యే విధంగా ఉండవు. కోర్ పాయింట్ ఏదైతే ఉందో దాని ఎస్టాబ్లిష్మెంట్ బాలేదు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే జీవీ ప్రకాష్ మ్యూజిక్ సినిమాకి ఫ్రెష్ నెస్ తీసుకొచ్చింది. ‘చమికి’ ‘సకియే’ వంటి పాటలు వినసొంపుగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అలరిస్తుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఓకే.

Youth Movie Review and Rating

విశ్లేషణ: కొన్ని కామెడీ సీన్స్ ఉంటే చాలు టైం పాస్ చేసేయొచ్చు అనుకునే వాళ్ళకి ‘యూత్’ నచ్చుతుందేమో.. కానీ ఒక న్యూ-ఏజ్ యూత్ఫుల్ మూవీ చూసి ఆస్వాదించాలనుకునే వారిని మాత్రం ‘యూత్’ డిజప్పాయింట్ చేస్తుంది.

Youth Movie Review and Rating

ఫోకస్ పాయింట్: ‘డ్రాగన్ 2’

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anishma Anilkumar
  • #GV Prakash Kumar
  • #Ken Karunaas
  • #Meenakshi Dinesh
  • #Priyanshi Yadav

Reviews

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

21 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

22 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

1 day ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version