Rana Naidu: ఈ మైనస్సులు లేకపోతే ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ఓ రేంజ్లో ఉండేది..!

విక్టరీ వెంకటేష్, రానా కాంబినేషన్లో ఇప్పటివరకు సినిమా అయితే రాలేదు. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ లో ఓ పాటలో కలిసి డాన్స్ చేశారు. ఇంకో రెండు, మూడు యాడ్స్ లో నటించారు.. అంతే..! వీరి కాంబినేషన్లో ఓ మంచి సినిమా రావాలని అభిమానులు ఆశపడ్డారు. కానీ వీళ్ళు మాత్రం కలిసి ఓ వెబ్ సిరీస్ చేశారు. వీరి కాంబినేషన్లో రూపొందిన తొలి వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. మార్చి 10న అంటే ఈరోజు నుండి ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ ..లు డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ను సుందర్ ఆరోన్, సుమిత్ శుక్లా కలిసి నిర్మించారు. వెంకటేష్, రానా లతో పాటు సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ఆశిష్ విద్యార్థి, ఆదిత్య మీనన్, ప్రియా బెనర్జీ, సౌరవ్ ఖురానా, సుచిత్రా పిళ్లై… వంటి వారు ఈ సిరీస్ లో ముఖ్య పాత్రలు పోషించారు. అయితే ఈ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరూ ఓ రేంజ్లో విమర్శలు గుప్పిస్తున్నారు. అందుకు గల కారణాలు అదే ఈ వెబ్ సిరీస్ కు మైనస్సులు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) అందరూ తిట్టుకోవడానికి అలాగే ఈ సిరీస్ ను ఓ రేంజ్లో ట్రోల్ చేయడానికి మెయిన్ కారణం ఈ సిరీస్ చాలా వల్గారిటీతో నిండి ఉండటం.

2) ఈ సిరీస్ చూడాలని భావించిన ప్రేక్షకులు కచ్చితంగా తమ ఫ్యామిలీ మెంబర్స్ తో చూడలేరు. మొదటి 5 నిమిషాలకే ఆఫ్ చేసేయడం ఖాయం.

3) వెబ్ సిరీస్ అన్నాక అలాగే కదా ఉండాల్సింది అని అంతా అనుకోవచ్చు. నిజమే వెబ్ సిరీస్ కు అందులోనూ ఓటీటీ కంటెంట్ కు పరిమితులు ఉండవు. కానీ పరిమితులు ఉండకూడదు అనేది రూల్ కాదు. వెబ్ సిరీస్ ముఖ్య ఉద్దేశం.. 3 గంటల్లో చెప్పడానికి వీలు లేని కథని ఎపిసోడ్ ల వారీగా 4,5 గంటల్లో చెప్పడం. అంతేకానీ సిరీస్ నిండా అడల్ట్ కంటెంట్ తో నింపేయాలని కాదు.

4) ఇలాంటి వెబ్ సిరీస్ లో వెంకటేష్ ప్రధాన పాత్ర పోషించడం అతని అభిమానులకు మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులెవ్వరికీ నచ్చలేదు.

5) నిజానికి వెంకటేష్ నటించాడు కాబట్టే ఈ సిరీస్ పై మొదటి నుండి ప్రేక్షకుల దృష్టి పడింది. అతను నటించిన వెబ్ సిరీస్ కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలనుకోవడం సహజం. కానీ వారు కలిసి చూడలేని విధంగా ఈ సిరీస్ ఉండటం బాధాకరం. రానా చెప్పినట్టు ఇది ఫ్యామిలీ అంతా చూసే వెబ్ సిరీస్. కానీ కలిసి కాదు విడి విడిగా చూస్తారేమో కావచ్చు. ఇది మైనస్ పాయింట్ మాత్రమే కాదు అందరినీ బాధపెట్టే పాయింట్ కూడా..!

6) పోనీ కథ పరంగా ఏమైనా గొప్పగా ఉందా. తండ్రిని అసహ్యించుకునే కొడుకు. కనీసం తండ్రిని నాన్న అని పిలవడానికి కూడా ఇష్టపడని కొడుకు. చెయ్యని తప్పుకి జైలు శిక్ష అనుభవించి వచ్చే తండ్రి. ఈ కథ వింటుంటే మనం ఎప్పుడో చూసిన ‘వారసుడు’ ‘స్నేహం కోసం’ గుర్తుకు వస్తాయి. కథ పరంగా కొత్తదనం లేనప్పుడు మొత్తం టేకింగ్ పైనే ఆధార పడాల్సి ఉంటుంది. పోనీ అదేమైనా గొప్పగా ఉందా అంటే క్లుప్తంగా ఓ పాయింట్ చెప్పడానికి 20 నిమిషాల పాటు సాగే సన్నివేశాలు.

7) కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ ల డైరెక్షన్ తెలుగు ప్రేక్షకుల్ని ఏమాత్రం మెప్పించే విధంగా లేదు.తెలుగు నేటివిటీ కంప్లీట్ గా మిస్ అయిన సిరీస్ ఇది. వాళ్ళు ఓ ‘మిర్జాపూర్’ సిరీస్ ను డైరెక్ట్ చేసినట్లు డైరెక్ట్ చేశారు అనే భావన కలిగిస్తుంది.

8) సంగీత్, సిద్ధార్థ్ ల నేపథ్య సంగీతం.. సన్నివేశాలు మూడ్ కు తగినట్లు లేదు.

9) ఎడిటింగ్ కు చాలా పని చెప్పొచ్చు. ఏకంగా 7 గంటల నిడివి ఉంది. ఇలాంటి సిరీస్ ను కామన్ ఆడియన్స్ చూడాలి అంటే కనీసం 2 రోజులు కేటాయించాలి.సినీ ప్రేమికులు అయితే కిందా మీదా పడి ఒక రోజులో చూసేస్తారు.

10) సంభాషణలు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సినిమాలకు పనిచేసే రైటర్స్ ఈ సిరీస్ కు డైలాగ్స్ రాసినట్లు లేదు. ఇద్దరు తాగుబోతులు మందుకొడుతూ రాసినట్టు ఉంది.

ఓవరాల్ గా ఈ సిరీస్ కు మైనస్సులు ఇవి. అయితే వెంకటేష్, రానా ల పెర్ఫార్మన్స్ వల్ల.. సింగిల్ గా చూడగలిగే సదుపాయం ఉంటే ‘రానా నాయుడు’ సిరీస్ ను ఒకసారి చూడొచ్చు. పైన చెప్పిన మైనస్సులు తీసేస్తే..ఫ్యామిలీ ఆడియన్స్ వెంకటేష్ ను బట్టి.. ఓటీటీ కంటెంట్ ను గౌరవించి చూసేవారు. ఇప్పుడు అదే మిస్ అయ్యింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus