ప్రభాస్(Prabhas) ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఇండియాలోనే అత్యధిక మార్కెట్ కలిగిన షారుఖ్ ఖాన్,సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి వాళ్ళతో సరి సమానంగా వసూళ్లు రాబట్టగల హీరో. అందులో ఎలాంటి సందేహం లేదు. ‘బాహుబలి’ తో ప్రభాస్ మార్కెట్ 10 ఇంతలు అయ్యింది. టాలీవుడ్లో నెంబర్ 1 హీరోగా ఎదిగాడు. ‘బాహుబలి’ కి ముందు అతని నెంబర్ 4,5 ప్లేసుల్లో ఉండేది. అయితే ప్రభాస్ సక్సెస్ ను టాలీవుడ్ ఓర్చుకోలేకపోతుందా?
ప్రభాస్ ని తొక్కేయాలనే కుట్ర జరుగుతుందా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. ఎందుకంటే ప్రభాస్ మాత్రమే కాదు ఇప్పుడు ప్రతి హీరో కూడా కంటెంట్ తో ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు అనే చెప్పాలి. అప్పుడు ప్రభాస్ ని తొక్కేయాలని కుట్ర ఎందుకు జరుగుతుంది? అంటే అది ఇప్పటి విషయం కాదు. గతంలో ఓ ప్రముఖ మ్యాగ్జైన్ ఉండేది. దానిలో ప్రభాస్ ను తొక్కేయాలనే కుట్ర జరుగుతున్నట్టు ఓ కథనం వచ్చింది. ఇప్పుడు అది మరోసారి వెలుగులోకి వచ్చింది.
కారణం ‘ది రాజాసాబ్’ పై జరుగుతున్న ట్రోలింగ్ వల్లే అని చెప్పాలి. ‘ది రాజాసాబ్’ పై మొదటి షో పడకుండానే డిజాస్టర్ టాక్ వచ్చింది. ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ పనిగట్టుకుని ‘ది రాజాసాబ్’ పై నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. సినిమా అటు ఇటుగా ఉన్న మాట వాస్తవం. దర్శకుడు మారుతి మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ.. ప్రభాస్ స్టార్ డమ్..ని మ్యానేజ్ చేస్తూ తీయలేకపోయాడు అనేది కూడా వాస్తవం. కానీ ఓ స్టార్ హీరో చేసిన కొత్త అటెంప్ట్ కి దక్కాల్సిన గౌరవం దక్కలేదు.
పైగా విమర్శల వర్షం కురిసింది. ప్రభాస్ ను కూడా చాలా మంది టార్గెట్ చేశారు. అందుకే అతని ఎదుగుదలకి ఓర్చుకోలేక టాలీవుడ్ అతన్ని తొక్కేయాలని చూస్తుంది అనే వార్తని వెలుగులోకి తెచ్చింది.అయితే ఇది ఇప్పటి వార్త కాదు. ‘ఛత్రపతి’ సినిమా రిలీజ్ అయిన 2 నెలలకు ఓ మ్యాగ్జైన్లో వచ్చిన స్పైసీ ఆర్టికల్. అందులో ఈ విధంగా రాసి ఉంది. ‘ప్రభాస్ లుక్స్, ఫిజిక్ వంటివి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించే విధంగా ఉంటాయి.
నటనలో ఇంప్రూవ్ అయితే అతనికి తిరుగుండదు. అందుకే టాలీవుడ్ కి చెందిన కొంతమంది పెద్ద హీరోలు తమ భవిష్యత్తుని, తమ కుమారుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఓ పెద్ద హోటల్లో మీటింగ్ పెట్టుకుని మరీ.. ప్రభాస్..ని తొక్కేయాలని ప్లాన్లు చేసినట్టు’ అందులో రాసుంది. అదీ విషయం.
తార సితార అని అప్పట్లో స్పైసీ ఆర్టికల్స్ రాసే మ్యాగజిన్ ఉండేది. అందులో ఛత్రపతి రిలీజ్ అయిన రెండు నెలలకు వచ్చిన ఆర్టికల్ ….#Prabhas pic.twitter.com/Cof2szMFFp
— Skydream Media (@SkydreamMedia) January 28, 2026