ఒకప్పుడు హీరోయిన్లకు ‘పెళ్లి అయ్యింది’ అంటే సినీ కెరీర్ ముగిసినట్టే అని అంతా భావించేవారు. అంతెందుకు పెళ్లి సంగతి పక్కన పెట్టి.. సినిమాల్లో ‘పెళ్ళై.. పిల్లలున్న రోల్స్ చేసినా’ వాళ్ళ కెరీర్ ముగిసినట్టే అనేవారు. చాలా వరకు అది నిజం కూడా.! కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారినట్టే కనిపిస్తుంది. పెళ్లై, పిల్లలున్నా హీరోయిన్ల స్టార్ డమ్ కి ఫరక్ పడదు అని కొంతమంది చాటి చెబుతున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతూ ఎంతో మందికి మాదిరి కరముగా నిలుస్తున్నారు. పెళ్లి అనేది ప్రొఫెషన్‌కు అడ్డంకి కాదని నిరూపిస్తూ, నేటి తరం(కొత్త హీరోయిన్లకు, అప్ కమింగ్) హీరోయిన్లకు భరోసా ఇస్తున్నారు. వాళ్ళు ఎవరెవరో ఓ లుక్కేద్దాం రండి :
1) శ్రియ శరన్ : సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ కు 2018 లో పెళ్లైంది. రష్యాకి చెందిన ఆండీ కోశ్చీవ్ తో చాలా కాలం డేటింగ్ చేసి పెళ్లి చేసుకుంది. లాక్ డౌన్ టైంలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది కూడా. అయినా సరే అదే గ్లామర్, అదే జోరు చూపిస్తుంది. ‘ఆర్ ఆర్ ఆర్’ ‘దృశ్యం’ సీక్వెల్స్(హిందీ) అలాగే ఇటీవల విడుదలైన ఫాంటసీ ఫిల్మ్ ‘మిరాయ్’లో అత్యంత కీలక పాత్ర పోషించి తన ఉనికిని బలంగా చాటుకుంది. పవిత్ర గ్రంథాలను కాపాడే కథాంశంతో వచ్చిన ఈ సినిమా, ఆమె కెరీర్ ఇంకా బలంగానే ఉందని చెప్పకనే చెబుతోంది.
2) కాజల్ అగర్వాల్ : టాలీవుడ్ ‘చందమామ’ గా స్టార్ స్టేటస్ దక్కించుకున్న కాజల్ అగర్వాల్… తన కెరీర్ అయిపోయిందంటూ వచ్చిన పుకార్లకు తన సినిమాలతోనే సమాధానమిస్తోంది.2020 లో తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న ఈమె.. ఓ బిడ్డకు జన్మనిచ్చింది కూడా..! అయినప్పటికీ ‘సత్య భామ’ ‘ది ఇండియా స్టోరీ’ వంటి ప్రాజెక్టులతో పాటు, కమల్ హాసన్ సరసన ‘ఇండియన్ 3’ వంటి పెద్ద ప్రాజెక్టుల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది.
3)నయనతార : నయనతార కూడా 2022 లో ప్రియుడు విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకుంది. అలాగే కవలలకు(సరోగసి పద్దతిలో) జన్మనిచ్చింది కూడా..! అయినా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.’గాడ్ ఫాదర్’ ‘జవాన్’ ‘అన్నపూర్ణి’ వంటి వరుస సినిమాల్లో నటించింది. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘మన శంకర్ వర ప్రసాద్ గారు’ అనే పెద్ద సినిమాలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది. 2026 సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
4) రకుల్ ప్రీత్ సింగ్: గతేడాది నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమ వివాహం చేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్. అయినప్పటికీ సినీ కెరీర్ కు ఈమె ఫుల్ స్టాప్ పెట్టలేదు. పెళ్లి తర్వాత మరింత ఉత్సాహంగా పనిచేస్తోంది. ‘ఇండియన్ 3’, ‘అమీరీ’ వంటి బడా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది.
5) కీర్తి సురేష్ : గతేడాది ప్రియుడు ఆంటోనీ తట్టిల్ ను ప్రేమ వివాహం చేసుకుంది కీర్తి సురేష్.అయినా సినిమాలు తగ్గించింది లేదు. తన పంథా మార్చుకుని వరుస సినిమాలకు ఓకే చెబుతుంది. ‘రివాల్వర్ రీటా’ ‘రౌడీ జనార్ధన’ ‘ఎల్లమ్మ’ వంటి క్రేజీ ప్రాజెక్టులు అలాగే వెబ్ సిరీస్..లలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది.
6)లావణ్య త్రిపాఠి : మెగా ఫ్యామిలీ కోడలిగా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి కూడా తగ్గడం లేదు. వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకుని.. ఓ బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ వరుస సినిమాలకు ఓకే చెబుతూ దూసుకుపోతుంది.ఆల్రెడీ దేవ్ మోహన్‌తో కలిసి ‘సతీ లీలావతి’ అనే రామ్ కామ్ లో నటించింది. త్వరలోనే ఆ సినిమా విడుదల కానుంది. అలాగే పలు ఓటీటీ ప్రాజెక్టులకు కూడా ఈమె ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.
7) హన్సిక : 2022 లో తన బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి సోహైల్ కతూరియాని వివాహం చేసుకుంది హన్సిక మోత్వానీ. అయినప్పటికీ ఈమె సినిమాలకు ఏమీ దూరం కాలేదు. ‘మై నేమ్ ఈజ్ శృతి’ ‘105 మినిట్స్’ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూనే బిజీగా గడుపుతోంది.
8)శోభిత ధూళిపాళ : 2024 చివర్లో నాగ చైతన్యని వివాహం చేసుకుంది శోభిత. అయినప్పటికీ సినిమాలు తగ్గించడం లేదు. తమిళ, మలయాళ భాషల్లో పలు క్రేజీ సినిమాలు, అలాగే వెబ్ సిరీస్..లకు ఓకే చెప్పిందట. ఇంకా కథలు వింటున్నట్టు తెలుస్తుంది.
9)అదితి రావ్ హైదరి : ఈమె యంగ్ ఏజ్లోనే పెళ్లి చేసుకుంది. తర్వాత మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. అయినప్పటికీ స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ‘సమ్మోహనం’ ‘అంతరిక్షం’ ‘వి’ ‘మహాసముద్రం’ వంటి పెద్ద సినిమాల్లో నటించింది. అయితే గతేడాది చివర్లో సిద్దార్థ్ ని 2వ పెళ్లి చేసుకుంది ఈ అమ్మడు. అయినప్పటికీ సినిమాలకు గుడ్ బై చెప్పలేదు. తమిళంలో ఒకటి, రెండు క్రేజీ సినిమాలకు ఓకే చెప్పినట్టు సమాచారం.
10)సమంత : 2017 లో నాగ చైతన్యని పెళ్లి చేసుకుంది. 2021 లో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంది. అయినప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తూనే ఉంది. నిర్మాతగా కూడా మారి ‘శుభం’ వంటి క్రేజీ సినిమాని రూపొందించింది.