Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

తెలుగు ప్రజలకు రాముడు అనగానే సీనియర్ ఎన్టీఆర్ గుర్తొస్తారు. ఎన్టీఆర్ తప్ప మరొకరిని ఆ పాత్రలో ఊహించుకోవడం కూడా కష్టం. ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది.అందుకే ఇప్పుడు వచ్చే సినిమాల్లో శ్రీరాముని పాత్ర చేయడానికి స్టార్ హీరోలు సాహసించడం లేదు. చేసినా జనాలు యాక్సెప్ట్ చేయడం లేదు. అందుకే సినిమాల్లో శ్రీరాముని పాత్రని చూపించి చూపించినట్టు.. బ్యాక్ గ్రౌండ్ షాట్స్ తో మేనేజ్ చేసేస్తున్నారు.

Mirai

ఇదిలా ఉండగా.. తేజ సజ్జ హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఇటీవల విడుదలై సంచలనం సృష్టిస్తున్న చిత్రం ‘మిరాయ్’ . ఈ సినిమా విడుదలైన కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.55 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్టు మేకర్స్ పోస్టర్స్ వదిలారు. ఈ సినిమాలో చాలా హైలెట్స్ ఉన్నప్పటికీ శ్రీరాముడు కనిపించే ఒక సన్నివేశం మాత్రం ప్రేక్షకులను ఫిదా చేస్తుంది.

ఆ సీన్ తెరపై కనిపించిన వెంటనే థియేటర్లు ‘జై శ్రీ రామ్’ నినాదాలతో దద్దరిల్లిపోతున్నాయి. ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్న ఆ సన్నివేశం, అందరినీ ఒకే ప్రశ్న అడిగేలా చేసింది. ఇంత అద్భుతంగా రాముడి పాత్రలో ఒదిగిపోయిన ఆ నటుడు ఎవరు? అనేదే ఆ ప్రశ్న.ఆ నటుడి పేరు గౌరవ్ బోరా. ఉత్తరాఖండ్‌లోని ఖతిమా అనే చిన్న పట్టణానికి చెందిన ఈ యువకుడు, డెహ్రాడూన్‌లో మాస్ కమ్యూనికేషన్ చేశాడు. కానీ, చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న ఇష్టంతో ఢిల్లీకి వెళ్ళాడు.

అక్కడ ‘కింగ్‌డమ్ ఆఫ్ డ్రీమ్స్, రాస్ థియేటర్ గ్రూప్’ వంటి ప్రముఖ డ్రామా సంస్థలతో కలిసి ఐదేళ్ల పాటు పనిచేశాడు.ఆ తర్వాత ఎన్నో షార్ట్ ఫిల్మ్స్, హిందీ సీరియల్స్, బజాజ్ ఫ్రీడమ్, టీవీఎస్ ఐక్యూబ్, సఫోలా ఆయిల్, టాటా క్యాపిటల్, ఆక్వా గార్డ్ వంటి బడా బ్రాండ్ల కమర్షియల్ యాడ్స్‌లో నటించాడు. అయినా రాని గుర్తింపు ‘మిరాయ్’ చిత్రంలోని ఒక్క సన్నివేశంతో వచ్చింది. శ్రీరాముని పాత్రలో ఈ యాక్టర్ నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఒక్క సినిమాతో గౌరవ్ బోరా కెరీర్ టర్న్ తీసుకుందని, ఇకపై అతనికి మరిన్ని గొప్ప అవకాశాలు రావడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus