తారల టాటూ ముచ్చట్లు

సినీ తారలు తమ బ్యూటీ స్పాట్ కి టాటూలతో మరింత వన్నెలు అద్దుతుంటారు. అందుకే ఎంతో నొప్పికి ఓర్చి తమ శరీరభాగాలపై పచ్చబొట్లు వేయించుకుంటుంటారు. ఇవి వారి అభిరుచిని చాటుతున్నాయి. కొంతమంది స్టార్లు తమకు ఇష్టమైన వారి పేర్లను పచ్చబొట్లుగా వేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ప్రత్యేకమైన టాటూలు వేసుకున్న టాలీవుడ్ నటీనటుల గురించి ఫోకస్…

నాగార్జున

లేటెస్ట్ ట్రెండ్ ని ఫాలో అవ్వడంతో కింగ్ నాగార్జున ఎల్లప్పుడూ ముందుంటారు. తన కుడి చేతి బైసప్ పై సూర్యుడి మధ్యలో ఉన్న ఓం ఆకారపు టాటూని వేసుకుని మన్మధుడని నిరూపించుకున్నారు. ఇది చాలామందిని ఆకట్టుకుంది. పచ్చబొట్టు వేసుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డ్ లోకి ఎక్కారు. ఆ డిజన్ టాటూని వేసుకోవడానికి కుర్రకారు ఆసక్తి చూపించారు.

త్రిష

అందాల తార త్రిష తన శరీరం పై రెండు చోట్ల టాటూస్ వేసుకుంది. తన ఎడమ బ్రెస్ట్ పై ఉన్న టాటూ యువతను విపరీతంగా ఆకర్షించింది. ఆ టాటూ నెమో అనే ఒక కార్టూన్ పాత్ర రూపం. ఈ పాత్ర నెమో సినిమాలో తెగ అల్లరి చేస్తుంది. ఆ పాత్రపై ఇష్టంతో ఆ రూపానికి గుండెపై స్థానం కల్పించింది. మరో టాటూ ఆమె ఎడమ చేతి బొటన వేలి పక్కన చిన్న డిజైన్ గా ఉంటుంది.

శృతి హాసన్

విశ్వనటుడు కమల్ హాసన్ పెద్ద కుమార్తె శృతి హాసన్ కి టాటూలు వేసుకోవడం అంటే ఇష్టం. అందుకే ఇది వరకు ఎడమ చేతి పై గులాబీ పువ్వును వేసుకుంది. చెవి కింద కూడా సంగీత స్వర చిహ్నాన్ని టాటూగా వేసుకుని తనకు సంగీతం పై ఉన్న ఇష్టాన్ని చాటుకుంది. అందరికంటే తనంటేనే ప్రేమ ఎక్కువని .. తన పేరుని తమిళంలో ఎడమ భుజం వెనుక “శృతి” అని టాటూ వేసుకుంది. ఆమె అప్పటి వరకు వేసుకున్న టాటూలన్నిటిని చెరిపేసుకుంది కానీ.. పేరు మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది.

నయనతార

మలయాళ కుట్టి నయనతార విజయాలతో పాటు వివాదాలతోను బాగా పాపులర్ అయ్యారు. ఆమె డాన్స్ మాస్టర్ ప్రభుదేవాతో ప్రేమలో ఉన్నపుడు అతని పేరుని ఎడమ చేతిపై టాటూ వేయించుకున్నారు. వీరి ప్రేమ పెళ్లి దాకా వెళ్ళింది. చివరి క్షణంలో విడిపోయారు. దాంతో ఈ టాటూని కొంతకాలం మేకప్ తో కవర్ చేశారు. తర్వాత తీసి వేయించారు.

సమంత

వరుస విజయాలతో దూసుకు పోతున్న క్యూట్ భామ సమంత మెడవెనుక టాటూ వేసుకుంది. ఆమె సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటిస్తున్న సమయంలో ఈ టాటూ వేసుకుని వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. అప్పటి బాయ్ ఫ్రెండ్ సిద్దార్ధ్ కి గుర్తుగా ఈ టాటూ వేసుకుందని అప్పట్లో రూమర్లు వచ్చాయి. తర్వాత కొత్త బాయ్ ఫ్రెండ్ కోసం చెరిపేసినట్లు సమాచారం.

రోజా

హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రోజా ప్రస్తుతం టీవీ షోలలో కనిపిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సినిమాలకు కొంత దూరమయ్యారు. గతంలో ఈమె తన ఛాతీ పైన అందమైన టాటూ వేసుకుని హాట్ గా కనిపించారు. పువ్వులు వాటి చుట్టూ సీతాకోక చిలుకలు గల టాటూ కనిపించేలా డ్రస్సు వేసుకుని ఈమె వెల్ కమ్ ఒబామా చిత్ర ఆడియో కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పటి ఫోటో ఇది.

సలోని

ఎస్.ఎస్.రాజమోళి సినిమా మర్యాద రామన్న సినిమాలో అపర్ణ గా మెప్పించిన సలోని తన భుజం మీద రాయల్ టాటూ వేయించుకుని ప్రత్యేకతను చాటుకుంది.

సూర్య

గజిని హీరో సూర్య కూడా తన మణికట్టు పక్కన చైనా సింబల్ టాటూ వేసుకున్నారు. అయితే అది కేవలం “వీడు” సినిమాలోని పాత్రమే కోసమేనని అప్పుడే క్లారిటీ ఇచ్చారు.

సంజన

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బుజ్జిగాడు చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ సంజన తన కుడి చెయ్యి మణికట్టు మీద “నెవర్ గివ్ అప్ ” అని ఇంగ్లీష్ లో పచ్చబొట్టు వేసుకుంది.

ప్రియమణి

త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న నటి ప్రియమణి రెండేళ్ల క్రితం టాటూ వేసుకుంది. తన చేతిపై “డాడీస్ గర్ల్ “అని ఇంగ్లీష్ లో టాటూ వేసుకుని నాన్న కూచి అని చాటుకుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus