Tollywood: ఈ వారం కూడా 12 సినిమాలు…ఈసారీ ఓటిటి డామినేషనే..!

ఫిబ్రవరి,నవంబర్ నెలలు ఎలాగు టాలీవుడ్ బాక్సాఫీస్ కు డ్రై సీజన్లు వంటివి అని అంతా అంటుంటారు.పైగా ఇప్పుడు పండుగలు కూడా ఏమీ లేవు కాబట్టి…పెద్ద హీరోలు, మీడియం రేంజ్ హీరోల సినిమాలు నవంబర్లో రావడం లేదు. గత వారమంతా చిన్న సినిమాలే సందడి చేసాయి. ‘అద్భుతం’ వంటి సినిమా ఓటిటిలో రిలీజ్ అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.ఇక ఈ వారం కూడా గత వారంలానే 10కి పైగా సినిమాలు థియేటర్ మరియు ఓటిటిల్లో సందడి చేయనున్నాయి. అందులో ‘దృశ్యం2’ వంటి పెద్ద సినిమా కూడా ఉంది. కాకపోతే అది ఓటిటిలో విడుదలవుతుంది. సరే ఇక లేట్ చేయకుండా ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలను ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో :

1) అనుభవించు రాజా : రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈ చిత్రం నవంబర్ 26న విడుదల కాబోతుంది.

2)క్యాలీఫ్లవర్ : సంపూర్ణేష్ బాబు నటించిన ఈ మూవీ నవంబర్ 25న విడుదల కాబోతుంది

3)ది లూప్ : తమిళ్ హీరో శింబు నటించిన ఈ పాన్ ఇండియా సినిమా నవంబర్ 25న విడుదల కాబోతుంది

4)1997 : నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్ 26న విడుదల కాబోతుంది.

5)కార్పొరేటర్ : షకలక శంకర్ హీరోగా రూపొందిన ఈ చిత్రం నవంబర్ 26న విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు.

6)ఆశ ఎన్కౌంటర్ : రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 26న విడుదల కాబోతుంది.

7) భగత్ సింగ్ నగర్ : ఈ చిన్న సినిమా కూడా నవంబర్ 26నే విడుదల కాబోతుంది.

8)సత్యమేవ జయతే 2 : జాన్‌ అబ్రహం నటించిన ఈ బాలీవుడ్ చిత్రం నవంబర్ 25న విడుదల కాబోతుంది

9)అంతిమ్ : సల్మాన్ నటించిన ఈ చిత్రం నవంబర్ 26న విడుదల కాబోతుంది.

ఓటిటిలో :

10)దృశ్యం 2 : వెంకటేష్ నటించిన ఈ చిత్రం నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది.

11)రొమాంటిక్ : ఆకాష్ పూరి హీరోగా నటించిన ఈ చిత్రం నవంబర్ 26 న ఆహాలో విడుదల కాబోతుంది.

12)రిపబ్లిక్ : సాయిధరమ్ తేజ్ నటించిన ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ నవంబర్ 26న జీ5లో విడుదల కాబోతుంది.

వీటితో పాటు మరికొన్ని పరభాషా చిత్రాలు ఓటిటిల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus