జగ్గు భాయ్ – నట విశ్వరూపం

వీరమాచినేని జగపతి బాబు, దాదాపుగా 25 ఏళ్ల నుంచి తెలుగు సినీ ప్రస్థానంలో రకరకాల పాత్రలతో అందరినీ మెప్పించారు. హీరోగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. బేస్ వాయిస్ తో అమాయకపు భర్త పాత్రలో, అందమైన ప్రేమికుడి పాత్రలో, త్యాగం చేసిన స్నెహితుని పాత్రలో నటించి మెప్పించాడు. దాదాపుగా 120కు పైగా చిత్రాల్లో నటించిన జగపతి బాబు అలియాస్ జగ్గు భాయ్ ఇప్పటివరకూ తన కరియర్ తో చేసిన డిఫరెంట్ పాత్రల్లో కొన్నింటిని ఒక లుక్ వేద్దాం రండి.

గాయం చిత్రం – పగ తీరుచుకునే తమ్ముడి పాత్రలో
ఈ చిత్రంలో మొట్ట మొదటి సారి జగపతి బాబు రఫ్ లుక్ లో కనిపించి, తన వాయిస్ కు న్యాయం చేశాడు. అంతేకాకుండా తొలిసారి తన డబ్బింగ్ తానే చెప్పుకున్నాడు. అన్ని వెరసి సినిమా బ్లాక్ బష్టర్ హిట్ అయ్యింది.

శుభలగ్నం – అర్ధం చేసుకునే భర్త పాత్రలో
ఈ చిత్రంలో డబ్బు కన్నా ప్రేమ అభిమానం అనేది ముఖ్యం అని చెప్పే భర్త పాత్రలో నటించి మెప్పించాడు. భార్య ఆశ కోసం తానే ఆస్తిగా మారి అమ్ముడుపోయిన భర్తగా జీవించాడు.

 

అంతపురం – సహాయం చేసే పాత్రలో
భర్తను పోగొట్టుకున్న సౌందర్య అక్కడి వాతావరణం నుంచి తప్పించుకునే సమయంలో అమాయకపు పాత్రలో, దుబాయ్ వెళ్ళాలనే కోరికతో డబ్బు కోసం ఏపనైనా చేసే రౌడీ పాత్రలో మన జగ్గు బాయ్ జీవించాడు. ఇక ఈ పాత్రకు నంది అవార్డ్ సైతం ఆయన్ని వరించింది.

మనోహరం – అమాయకపు భర్త పాత్రలో
ఈ చిత్రంలో జగపతి బాబు నటనకు మరో సారి నంది తలవంచింది. అమాయకపు భర్తగా, ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిన సామాన్యుడిగా మంచి నటన కనబరిచి అందరినీ మెప్పించాడు.

ఫ్యామిలీ సర్కస్ – సరదా మనిషిగా, అమాయకపు ఇంటి ఓనర్ గా
తనదైన పాత్రలో నటించి మెప్పించే జగపతి బాబు కామెడీ ఫ్యామిలీ డ్రామాలో తన నటనతో మెప్పించాడు.

హనుమాన్ జంక్షన్ – షార్ట్ టెంపర్ కలిగిన స్నెహితుని పాత్రలో
కోపంతో, నవ్విస్తూ, ఆటపట్టిస్తూ, స్నేహం కోసం త్యాగం చేసే ఒక ఊరి జమీంధార్ పాత్రలో నటించి మెప్పించాడు.

పెద్ద బాబు – నాయకుడుగా, తల్లిని పూజించే కొడుకుగా
తల్లి చేసిన తప్పుని ధికరిస్తూనే, తల్లిని, కుటుంబాన్ని కాపాడే కొడుకుగా, అంతేకాకుండా ఊరిని కాపాడే నాయకుడిగా విశ్వరూపం చూపించాడు

అనుకోకుండా ఒక రోజు – పోలీస్ పాత్రలో
ఒక ప్రత్యేక పోలీస్ పాత్రలో, పెళ్లి చేసుకోవాలనే తపనతో, ఒక కేస్ చేదనలో చివరకు చార్మిని ప్రేమిస్తూ చివరకు బ్యాచలర్ గానే మిగిలిపోయే పోలీస్ లాగా ఉండిపోతాడు. ఈ సినిమాలో జగపతి యాక్టింగ్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించింది.

సామాన్యుడు – సమాజంపై భాద్యత కలిగిన వ్యక్తి పాత్రలో
తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకునే పాత్రలో లా చదువుకున్న జర్నలిస్ట్ పాత్రలో నటించి మెప్పించాడు.

కధానాయకుడు – అమాయకపు బార్బర్, మంచి స్నెహితుని పాత్రలో
హీరోగానే కాకుండా సహాయ పాత్రల్లో కూడా జగపతి బాబు నటించి మెప్పించాడు. అలాంటి పాత్రల్లో కధానాయకుడు సినిమాలోని బాలు పాత్ర, ఈ చిత్రంలో సూపర్ స్టార్ కు ఫ్రెండ్ గా, సామాన్య బార్బర్ గా అద్భుతమైన నటన కనబరిచాడు.

లెజెండ్ – రఫ్ లుక్ ఉన్న విలన్ గా
దాదాపుగా జగపతి పాత్ర సినీ పరిశ్రమలో అయిపోయింది అన్న క్రమంలో “లెజెండ్” సినిమాలో విలన్ పాత్రలో బుల్లెట్ లాగా దూసుకొచ్చాడు జగ్గు బాయ్. ఇక ఈ చిత్రంలో నటనకు బెస్ట్ విలన్ గా అవార్డ్ సైతం అందుకున్నాడు.

నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు – స్టైలిష్, తెలివిగల విలన్, తండ్రి పాత్రలో
నవ్వుతూ, తన తెలివి తేటలతో హీరోను ముప్పు తిప్పలు పెట్టే తెలివైన విలన్ పాత్రలో నాన్నకు ప్రేమతోలో నటించాడు. ఇక కొడుకు కోసం నిత్యం పరితపించే తండ్రి పాత్రలో శ్రీమంతుడు సినిమాలో నటించి అందరి మన్నలను పొందాడు.

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus