బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 చివరి దశకి చేరుకుంది. ఇందులో భాగంగా 13వ వారం నామినేషన్స్ వేడెక్కిపోయాయి. ముఖ్యంగా మోనాల్ అఖిల్ ని నామినేట్ చేయడం అనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, హౌస్ లో తను ఎంత పవర్ ఫుల్ పర్సన్ గా మారానో, గేమ్ ని ఎంత బాగా ఆడుతున్నానో మరోసారి చెప్పే ప్రయత్నం చేసింది మోనాల్. తన గేమ్ ని తను ఆడుతూ వస్తున్నానని చెప్పింది.
ఇక్కడ టాస్క్ ఆడటం ఒక్కటే కాదు.., హౌస్ లో ఉండటం కూడా గేమ్ లో భాగమే అంటూ అవినాష్ కి క్లాస్ ఇచ్చింది. తర్వాత హారిక అభిజిత్ ని నామినేట్ చేయడం, అలాగే హారికని అభిజిత్ తిరిగి నామినేట్ చేయడం అనేది కూడా ఆసక్తిని రేపింది. ఎవరైతే ఇన్నాళ్లూ జోడీగా ఉన్నారో , వాళ్లే ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. అంతేకాదు, మోనాల్ విషయంలోనే ఈ నామినేషన్స్ మళ్లీ జరగడం, అలాగే హారిక ఏదైతే శనివారం ఎపిసోడ్ చూసి డిస్టర్బ్ అయ్యిందో, అదే విషయంలో అభిజిత్ ని నామినేట్ చేయడం అనేది ట్విస్ట్ అనే చెప్పాలి.
ఇక మరోవైపు అరియానా సోహైల్ మరోసారి టామ్ అండ్ జెర్రీ లాగా మాట్లాడుకున్నారు. నామినేట్ చేసుకున్నారు. అయితే, బౌల్ లో వాటర్ లెవల్స్ తక్కువగా ఉండటం వల్ల, సోహైల్, అరియానా ఇద్దరూ కూడా నామినేషన్స్ ని తప్పించుకున్నారు. లాస్ట్ వీక్ కూడా సోహైల్ నామినేషన్స్ లోకి రాలేదు.
ఇప్పుడు ఈవారం చూసినట్లయితే, అఖిల్, అభిజిత్, హారిక, ఇంకా మోనాల్, అవినాష్ ఈ ఐదుగురు నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఎక్కువగా మోనాల్, అవినాష్ ఈ ఇద్దరికీ డేంజర్ జోన్ అని చెప్పొచ్చు. లాస్ట్ టైమ్ హారిక – అభిజిత్ ఇచ్చిన మోరల్ సపోర్ట్ తో మోనాల్ సేఫ్ అయ్యింది. అలాగే హారిక, అభిజిత్ ఫ్యాన్స్ కూడా మోనాల్ ని సేఫ్ చేశారు. ఇప్పుడు ఆ సిట్యూవేషన్ లేదు కాబట్టి డేంజర్ జోన్ లో ఉంది. అలాగే, అవినాష్ కూడా ఈవారం మరోసారి డేంజర్ జోన్ లో ఉన్నాడు. అదీ మేటర్.