18 Pages Collections: ’18 పేజెస్’ .. ఫస్ట్ మండే ఓకే అనిపించింది ..!

  • December 27, 2022 / 04:16 PM IST

‘జీఏ 2 పిక్చర్స్’ , ‘సుకుమార్ రైటింగ్స్’ నిర్మాణంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ’18 పేజెస్’. బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ‘కార్తికేయ2’ వంటి పాన్ ఇండియా హిట్ మూవీ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్లో వస్తున్న మూవీ ఇది. ‘కుమారి 21ఎఫ్’ వంటి సూపర్ హిట్ తర్వాత సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ కొంత గ్యాప్ తీసుకుని డైరెక్ట్ చేసిన మూవీ కూడా.

డిసెంబర్ 23న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ మూవీకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ జస్ట్ యావరేజ్ అనిపించాయి. రెండో రోజు కూడా యావరేజ్ గానే కలెక్ట్ చేసిన ఈ మూవీ ఆదివారం నాడు పర్వాలేదు అనిపించింది. ఇక ’18 పేజెస్’ 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 2.42 cr
సీడెడ్ 0.45 cr
ఉత్తరాంధ్ర 0.52 cr
ఈస్ట్ 0.34 cr
వెస్ట్ 0.18 cr
గుంటూరు 0.24 cr
కృష్ణా 0.19 cr
నెల్లూరు 0.14 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.34 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.46 cr
ఓవర్సీస్ 0.74 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 5.54 cr (షేర్)

’18 పేజెస్’ చిత్రానికి రూ.12.59 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.13 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.5.54 కోట్ల షేర్ ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.7.46 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇదే విధంగా రెండో వీకెండ్ వరకు కలెక్ట్ చేస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus