18 Pages Collections: ’18 పేజెస్’ .. యావరేజ్ ఓపెనింగ్స్ ను సాధించింది..!

  • December 24, 2022 / 01:51 PM IST

‘జీఏ 2 పిక్చర్స్’ , ‘సుకుమార్ రైటింగ్స్’ నిర్మాణంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ’18 పేజెస్’. బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ‘కార్తికేయ2’ వంటి పాన్ ఇండియా హిట్ మూవీ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్లో వస్తున్న మూవీ ఇది. ‘కుమారి 21ఎఫ్’ వంటి సూపర్ హిట్ తర్వాత సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ కొంత గ్యాప్ తీసుకుని డైరెక్ట్ చేసిన మూవీ కూడా.

డిసెంబర్ 23న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ మూవీకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ జస్ట్ యావరేజ్ అనిపించాయి. బి,సి సెంటర్లలో ‘ధమాకా’ కే ప్రేక్షకులు ఎక్కువగా ఓటేశారు. ఇక ’18 పేజెస్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.67 cr
సీడెడ్ 0.16 cr
ఉత్తరాంధ్ర 0.19 cr
ఈస్ట్ 0.11 cr
వెస్ట్ 0.10 cr
గుంటూరు 0.14 cr
కృష్ణా 0.11 cr
నెల్లూరు 0.08 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.56 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.19 cr
ఓవర్సీస్ 0.51 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 2.26 cr (షేర్)

’18 పేజెస్’ చిత్రానికి రూ.12.59 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.13 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రానికి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినప్పటికీ.. జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే నమోదయ్యాయి.

అయితే బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.10.74 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.టార్గెట్ చిన్నదే.. కానీ వీకెండ్ భారీగా క్యాష్ చేసుకుంటే తప్ప బ్రేక్ ఈవెన్ కష్టమనే చెప్పాలి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus