2021 టాప్ షేర్స్ దక్కించుకున్న సినిమాలు ఇవే

గత ఏడాది మార్చి తరువాత కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో మన దేశంలో లాక్ డౌన్ విధించడం జరిగింది. దానితో అన్ని రంగాలు మూతబడ్డాయి. అయితే ఆ తరువాత కొన్ని నెలల అనంతరం మెల్లగా లాక్ డౌన్ సడలించిన ప్రభుత్వం డిసెంబర్ నుండి సినిమాల థియేటర్స్ తెరుచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఆ తరువాత ఈ ఏడాది జనవరి నుండి వరుసగా పలు సినిమాలు విడుదలై ఆడియన్స్ ని అలరించాయి. అయితే గడచిన ఈ ఏడు నెలల కాలంలో ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో టాప్ 10 స్థానంలో అత్యధిక బాక్సాఫీస్ షేర్ దక్కించుకున్న సినిమాలు ఏవంటే,

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ తీసిన వకీల్ సాబ్ ముందుగా రూ. 86.36 కోట్ల షేర్ తో నెంబర్ వన్ స్థానంలో నిలవగా, ఆ తరువాత పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిల ఉప్పెన మూవీ రూ. 51.52 కోట్ల షేర్ తో రెండవ స్థానంలో, రవితేజ తో గోపీచంద్ మలినేని తీసిన క్రాక్ మూవీ రూ. 39.26 కోట్ల షేర్ తో మూడవ స్థానంలో, నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటించిన జాతిరత్నాలు మూవీ రూ. 38.52 కోట్ల షేర్ తో నాలుగవ స్థానంలో, రామ్ డ్యూయల్ రోల్ చేసిన రెడ్ మూవీ రూ. 19.79 కోట్ల షేర్ తో ఐదవ స్థానంలో నిలిచింది.

నితిన్ కీర్తి సురేష్ ల రంగ్ దే రూ. 16.51 కోట్ల షేర్ తో ఆరవ స్థానంలో, విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తీసిన మాస్టర్ మూవీ రూ. 14.6 కోట్ల షేర్ తో ఏడవ స్థానంలో, శర్వానంద్ హీరోగా తెరకెక్కిన శ్రీకారం రూ. 9.64 కోట్ల షేర్ తో ఎనిమిదవ స్థానంలో, నితిన్ తో చంద్రశేఖర్ ఏలేటి తీసిన చెక్ మూవీ రూ. 9.35 కోట్ల షేర్ తో తొమ్మిదవ స్థానంలో, కిరణ్ సబ్బవరం హీరోగా రూపొందిన ఎస్ ఆర్ కల్యాణమండపం మూవీ రూ. 7.96 కోట్ల షేర్ తో పదవ స్థానంలో నిలిచాయి. ఇక ప్రస్తతం మరికొన్ని సినిమాలు థియేటర్స్ లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus