సంక్రాంతి డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు కష్టమేనా.. ఏమైందంటే?

  • December 20, 2023 / 10:47 AM IST

ప్రతి సంవత్సరం సంక్రాంతి కానుకగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగకు పోటీ ఒకింత ఎక్కువగా ఉందనే సంగతి తెలిసిందే. 2024 సంక్రాంతి కానుకగా గుంటూరు కారం, నా సామిరంగ, సైంధవ్, ఈగిల్, హనుమాన్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలపై మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమాలన్నీ సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే ఈ సినిమాలతో పాటు సంక్రాంతి పండుగకు రజనీకాంత్ లాల్ సలామ్, ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ అయలన్ సినిమాలు సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నాయి.

తెలుగు సినిమాలు ఎక్కువగా రిలీజ్ కానున్నా తమిళ సినిమాలకు సైతం కొన్ని స్క్రీన్లను కేటాయించక తప్పదు. అయితే సంక్రాంతి డబ్బింగ్ సినిమాలకు ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకడం సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మూడు సినిమాలలో కనీసం రెండు సినిమాలు నష్టపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2024 సంక్రాంతి సినిమాలలో ఎన్ని సినిమాలు కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేసాయో చూడాల్సి ఉంది.

పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు మాత్రం బయర్లు, నిర్మాతలకు మంచి లాభాలను అందించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కొన్ని సినిమాలకు సంబంధించి థియేటర్ల ఓనర్లత ఇప్పటికే అగ్రిమెంట్లను కుదుర్చుకున్నారని సమాచారం. నా సామిరంగ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి కూడా అధికారిక ప్రకటన వస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సంక్రాంతి సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తాయేమో చూడాలి.

సంక్రాంతి సినిమాలు (Sankranthi)  థియేటర్లలో 500 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమాలలో కొన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కాగా ఆ సినిమాలు ఇతర భాషల్లో మెప్పిస్తాయో లేదో చూడాల్సి ఉంది. సంక్రాంతి సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus