2026 Tollywood: 2026 టాలీవుడ్‌… అలరించనున్న కొత్త అందాలు

సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. కాబట్టి హీరోయిన్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది.టాలీవుడ్లో అయితే మరీను. ఒక్క హిట్టు పడితే చాలు.. హీరోయిన్ల లైఫ్ సెటిల్ అయిపోయినట్లే. కానీ ఇప్పుడు టాలీవుడ్ కు హీరోయిన్ల కొరత ఏర్పడింది. దీనికి క్యాష్ చేసుకోవాలని ఇతర భాషల భామల నుండి మన లోకల్ టాలెంట్ వరకు అందరూ లక్ పరీక్షించుకోనున్నారు. మన ఇండస్ట్రీలో ఉండే కాంపిటీషన్, ఇక్కడ దొరికే క్రేజ్, రెమ్యునరేషన్ మరెక్కడా దొరకదనే చెప్పాలి.

2026 Tollywood

మరి ఈ 2026 టాలీవుడ్లో(2026 Tollywood) బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అవుతున్న కొత్త భామలు ఎవరో ఓ లుక్కేద్దామా :

1)సాత్విక వీరవల్లి :చాలా కాలం తర్వాత ఒక అచ్చ తెలుగు అమ్మాయి బడా ప్రాజెక్టుతో ఎంట్రీ ఇస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో సాత్విక వీరవల్లి పరిచయం అవుతోంది. గీతా ఆర్ట్స్, వైజయంతీ మూవీస్ లాంటి బడా బ్యానర్స్ ఆమెను లాంచ్ చేస్తున్నాయంటే అమ్మడిలో విషయం గట్టిగానే ఉండి ఉండాలి. లంగావోణీలో సాత్విక లుక్స్ చూస్తుంటే.. ఫ్యూచర్‌లో ఇక్కడ స్టార్ హీరోయిన్‌గా పాతుకుపోయేలానే కనిపిస్తోంది.

2)ఇమ్మాన్వీ ఇస్మైల్ : అందరి కళ్లు ఇమ్మాన్వీ ఇస్మైల్ మీదే ఉన్నాయి. ఎందుకంటే ఈ బ్యూటీ ఎంట్రీ ఇస్తోందే ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ‘ఫౌజీ’తో ఇమ్మాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే తన డ్యాన్స్ వీడియోలతో ఇన్‌స్టాలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ భామ.. డెబ్యూతోనే పాన్ ఇండియా రేంజ్‌కి వెళ్లిపోవడం ఖాయం అనిపిస్తోంది. ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ కానుంది.

3)సారా అర్జున్ : గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ట్రెండీ మూవీ ‘యూఫోరియా’తో సారా అర్జున్ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ‘ధురంధర్’ సినిమాతో ఇప్పటికే నేషనల్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్న సారాకు ఇక్కడ భారీ హైప్ ఉంది. ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ‘యూఫోరియా’ టీమ్ గట్టిగానే ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా క్లిక్ అయితే సారాకు ఇక్కడ వరుస ఆఫర్స్ క్యూ కట్టడం గ్యారెంటీ.

4)మాళవిక మోహనన్: ‘ది రాజాసాబ్’తో మాళవిక మోహనన్ టాలీవుడ్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, టాలెంట్ గురించి మాత్రం అంతా చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమాలో కూడా ఈమె ఎంపికైనట్టు కథనాలు వినిపిస్తున్నాయి. అది కనుక వర్కౌట్ అయితే అమ్మడికి టాలీవుడ్లో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.

తన రిలేషన్షిప్ గురించి ఓపెన్ అయిపోయిన ఫరియా అబ్దుల్లా

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus