‘జాతిరత్నాలు’ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది ఫరియా అబ్దుల్లా(Faria Abdullah). తన హైట్, కామెడీ టైమింగ్‌తో ‘చిట్టి’గా యూత్ మనసు దోచుకుంది. సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలతో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి ఓ సీక్రెట్ రివీల్ చేసి అందరికీ షాకిచ్చింది. తాను ప్రేమలో ఉన్నానని మొదటిసారిగా పబ్లిక్‌గా ఒప్పుకుంది.
రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియాను.. ‘మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారా?’ అని యాంకర్ ప్రశ్నించగా.. కాస్త సిగ్గుపడుతూనే ‘అవును’ అని చెప్పేసింది. ప్రేమలో ఉండటం వల్ల తన లైఫ్ చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉందని, సినిమా షూటింగ్స్ బిజీలో ఆ ఫీలింగ్ తనకు ప్రశాంతతను ఇస్తుందని మనసులో మాట బయటపెట్టింది.ఇక ఆ లక్కీ ఫెలో ఎవరనే విషయంపై కూడా ఫరియా ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.
అతను సినిమా హీరో కాదని, కానీ ఆర్ట్ అండ్ డ్యాన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాడని తెలిపింది. ఇద్దరూ కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటారట. తన ప్రియుడు హిందువు అని క్లారిటీ ఇచ్చిన ఫరియా.. ప్రస్తుతానికి అతడి పేరు గానీ, ఫోటో గానీ రివీల్ చేయలేదు. దీంతో ఆ ‘మిస్టరీ బాయ్’ ఎవరై ఉంటారని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు.యూట్యూబ్ నుంచి సినిమాల్లోకి వచ్చి ‘మత్తు వదలరా 2’, ‘కల్కి’ వంటి సినిమాల్లో మెరిసిన ఫరియా..ఇటీవల వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ లో కూడా సందడి చేసింది. ప్రస్తుతం తన లవ్ స్టోరీతో నెట్టింట ట్రెండింగ్ లో నిలిచింది.