Anand Deverakonda: ఆనంద్ దేవరకొండ సినిమాకు రూ.25 కోట్ల బడ్జెట్టా?

విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినిమాల్లోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. ‘దొరసాని’ ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ‘బేబీ’ వంటి సినిమాలతో ఆనంద్ హీరోగా నిలదొక్కుకున్నాడు. ‘బేబీ’ తో ఇతనికి కొంత మార్కెట్ కూడా ఏర్పడింది.ప్రస్తుతం ’90’s’ దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ దర్శకుడితో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఇవి 2 కూడా క్రేజీ ప్రాజెక్టులే. ఇదిలా ఉండగా.. ఆనంద్ దేవరకొండ సినిమాల బడ్జెట్లు కూడా హద్దులు దాటేస్తున్నట్టు లేటెస్ట్ టాక్.

Anand Deverakonda

సాధారణంగా ఆనంద్ దేవరకొండ వంటి హీరోలతో రూ.10 కోట్ల బడ్జెట్లో సినిమాలు చేస్తే.. నిర్మాతలు సేఫ్ జోన్లో ఉంటారు. అంతకు మించి బడ్జెట్ దాటితే రూ.15 కోట్లు మించకుండా చూసుకోవడంలో రిస్క్ తక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆనంద్ దేవరకొండ సినిమా బడ్జెట్ రూ.25 కోట్లు దాటేస్తున్నట్టు టాక్. విషయంలోకి వెళితే.. ఆనంద్ దేవరకొండ హీరోగా ’90’s’ దర్శకుడు ఆదిత్య దర్శకత్వంలో ఆ వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.25 కోట్లు అయిపోతుందని సమాచారం. ఈ సినిమా కోసం ఆనంద్ రూ.4 కోట్లు పారితోషికం అందుకున్నాడు. వైష్ణవి చైతన్య హీరోయిన్. ఆమెకు కోటి ఇస్తున్నట్టు టాక్. ఇక్కడే రూ.5 కోట్లు అయిపోతుంది. అలాగే ఆనంద్.. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ దర్శకుడు వినోద్ తో చేస్తున్న సినిమా బడ్జెట్ కూడా రూ.23 కోట్ల వరకు అవుతుందట. ఆనంద్ వంటి హీరోల సినిమాలకు ఈ రేంజ్లో బడ్జెట్ అవుతుంది అంటే చాలా కష్టం అనే చెప్పాలి.

‘కాంతార చాప్టర్ 1’ కలెక్షన్స్.. ఇప్పటికీ డీసెంట్ కానీ!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus