ఒక్క పాటలో 27 మంది తారలు..!

బాలీవుడ్ లో షారూఖ్ ఖాన్ నటించిన ‘ఓం శాంతి ఓం’ చిత్రంలో ఓ పాటలో 20 మంది తారలు ఒకసారి తళుకున్న మెరిసారు. అదే విధంగా ‘కింగ్’ చిత్రంలో నాగార్జున 8 మంది హీరోయిన్లతో చిందేశాడు. ఇప్పుడు తాజాగా కోలీవుడ్ లో తెరకెక్కుతున్నచిత్రంలోని ఓ పాటలో ఏకంగా 27 మంది తారలు ఒకేసారి తెరమీద కనిపించనున్నట్లు సమాచారం.

డైరెక్టర్ బాలా దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన అధిరుపన్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ముప్పరిమానమ్’. శాంతను భాగ్యరాజ్, శృతి దంగే జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ పాటలో ప్రభుదేవా, రమ్యకృష్ణ, జాకీశ్రోఫ్, ఆర్య, రాధిక, పూర్ణిమ, వివేక్, పార్థీపన్, వెంకట్ ప్రభు, విజయ్ ఆంటోని, బాబీ సింహా, సంగీత, క్రిష్ తదితర నటులు ఒకే సారి తెర పంచుకొనున్నారని కోలీవుడ్ వర్గాలు అంటున్నారు. జి‌వి ఆనంద్ స్వరపరచిన ఈ గీతానికి బృందా మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus