3 BHK Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘3 BHK’
- July 10, 2025 / 06:17 PM ISTByPhani Kumar
సిద్ధార్థ్ (Siddharth) లేటెస్ట్ మూవీ ‘3 BHK‘ గత శుక్రవారం అనగా జూలై 4న రిలీజ్ అయ్యింది. శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన సినిమా ఈ సినిమాని అరుణ్ విశ్వ నిర్మించారు. సొంతింటి కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ దాన్ని నెరవేర్చుకునేది అతి తక్కువ మందే. అలాంటి థీమ్ తో రూపొందిన సినిమానే ఇది. టీజర్, ట్రైలర్ ప్రేక్షకులకి రిలేట్ అయ్యాయి. రిలీజ్ రోజున పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
3 BHK Collections

ఫ్యామిలీ ఎమోషన్స్,చిన్న మెసేజ్ తో సినిమా బాగానే ఉంటుంది. కానీ జనాలు థియేటర్లకు పెద్దగా రాలేదు. ఈ సినిమాకి ఎక్కువ టికెట్లు తెగలేదు. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
మరిన్ని సినిమా వార్తలు.
| నైజాం | 0.59 cr |
| సీడెడ్ | 0.10 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.48 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.17 cr (షేర్) |
‘3 BHK‘ సినిమాకు రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజుల్లో ఈ సినిమా రూ.1.17 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.2 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.33 కోట్ల షేర్ ను రాబట్టాలి. వీక్ డేస్ లో ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్ట్ చేయలేదు. చాలా వరకు థియేటర్స్ తగ్గిపోయాయి. రేపు కొత్త సినిమాలు వస్తాయి కాబట్టి.. ఈ సినిమాని ఆడియన్స్ పట్టించుకోకపోవచ్చు.
Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















