సిద్ధార్థ్ (Siddharth) లేటెస్ట్ మూవీ ‘3 BHK‘ గత శుక్రవారం అనగా జూలై 4న రిలీజ్ అయ్యింది. శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన సినిమా ఈ సినిమాని అరుణ్ విశ్వ నిర్మించారు. సొంతింటి కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ దాన్ని నెరవేర్చుకునేది అతి తక్కువ మందే. అలాంటి థీమ్ తో రూపొందిన సినిమానే ఇది. టీజర్, ట్రైలర్ ప్రేక్షకులకి రిలేట్ అయ్యాయి. రిలీజ్ రోజున పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
ఫ్యామిలీ ఎమోషన్స్,చిన్న మెసేజ్ తో సినిమా బాగానే ఉంటుంది. కానీ జనాలు థియేటర్లకు పెద్దగా రాలేదు. ఈ సినిమాకి ఎక్కువ టికెట్లు తెగలేదు. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 0.59 cr |
సీడెడ్ | 0.10 cr |
ఆంధ్ర(టోటల్) | 0.48 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 1.17 cr (షేర్) |