రేణూ దేశాయ్ (Renu Desai) పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పటి హీరోయిన్ గా, పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఈమె పాపులర్. పవన్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఈమె తన ఇద్దరు పిల్లలతో కలిసి సింగిల్ మదర్ లైఫ్ ను లీడ్ చేస్తుంది. పలు బుల్లితెర షోలకి జడ్జ్ గా చేసింది. అయితే ఆ తర్వాత ఈమె 2వ పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యింది. ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నట్టు అప్పట్లో కొన్ని ఫోటోలు షేర్ చేసి పెద్ద దుమారం రేపింది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
ఇప్పటికీ పవన్ ఫ్యాన్స్ తో ఈమెకు ఏదో ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తూనే ఉంటుంది. అయితే ఆమె రెండో పెళ్లి ఎవర్ని చేసుకోబోతుంది? ఎంగేజ్మెంట్ చేసుకున్న వ్యక్తి ఎవరు? అనే ప్రశ్నలు… ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఇదిలా ఉండగా.. తాజాగా తన 2వ పెళ్ళి అంశం గురించి మరోసారి స్పందించారు రేణూ దేశాయ్ (Renu Desai) . ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఇలా మాట్లాడటం జరిగింది.
‘2వ పెళ్లి చేసుకోవడానికి నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను. కానీ, మరికొన్ని ఏళ్ళు వేచి చూడాలని భావిస్తున్నాను.నా జీవితంలో కూడా ఓ మ్యారేజ్ లైఫ్ ఉండాలని, ప్రేమ ఉండాలని ఆశపడుతున్నాను. కోరుకుంటున్నాను. కానీ పిల్లలు కొంచెం సెటిల్ అయితే నాకు ధైర్యంగా ఉంటుంది. అందుకే కొన్నేళ్ళు టైం తీసుకోవాలని అనుకుంటున్నాను.
2వ పెళ్లి విషయంలో డెసిషన్ ఎప్పుడో తీసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు రేణూ దేశాయ్. 2023 చివర్లో రవితేజ హీరోగా వచ్చిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో రీ- ఎంట్రీ ఇచ్చారు రేణూ దేశాయ్. తర్వాత ఆమె మరో సినిమా చేయలేదు.