ప్రతివారం కొత్త సినిమాలతో థియేటర్లు, డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ఆకట్టుకునే వెబ్ సిరీసులతో పాటు.. ఓటీటీలో ప్రీమియర్స్ కాబోయే కొత్త చిత్రాలతో ఓటీటీలు సందడి చేస్తూనే ఉన్నాయి..ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌చేస్తూనే ఉన్నాయి.. హాల్స్‌లో రిలీజ్ అయ్యేటప్పుడుండే అంతటి హడావిడి లేకపోయినా కానీ, బిగ్ స్క్రీన్ మీద సరిగా ఆడని చిత్రాలు కూడా ఓటీటీల్లో క్లిక్ అవుతున్నాయి.. మరో మూడు వారాల్లో 2022 కంప్లీట్ అయిపోతుంది. డిసెంబర్ రెండోవారం (డిసెంబర్ 12 నుండి 18 వరకు) ఓటీటీ మరియు థియేటర్లలో విడుదల కానున్న మూవీస్ అండ్ సిరీస్‌లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
1. లాంగ్ డ్రైవ్ (కన్నడ)..
సుప్రిత, సత్యనారాయణన్, అర్జున్ యోగేష్ రాజ్ నటించగా.. శ్రీ రాజు జి. రోడ్ ట్రావెలింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన ‘లాంగ్ డ్రైవ్’ డిసెంబర్ 15న విడుదలవుతోంది..
2. అవతార్ : ది వే ఆఫ్ వాటర్..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఏళ్ల తరబడి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జేమ్స్ కామెరూన్ అద్భుతసృష్టి ‘అవతార్’ సీక్వెల్ ‘అవతార్ : ది వే ఆఫ్ వాటర్’.. డిసెంబర్ 16న సుమారు 160 భాషలలో ‘అవతార్ 2’ కనీవినీ ఎరుగని రీతిలో రిలీజ్ కాబోతుంది..
3. యూ టర్న్ 2 – (తెలుగు – కన్నడ)..
డిఫరెంట్ కథాంశంతో తెలుగుతో పాటు కన్నడ భాషలో తెరకెక్కిన హారర్ ఫిలిం.. ‘యూ టర్న్ 2’.. దర్శకుడు చంద్రు ఓబయ్య, కరి సుబ్బు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది..
4. శాసనసభ..
ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్ భకుని, రాజేంద్ర ప్రసాద్, సోనియా అగర్వాల్ తదితరులు నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘శాసనసభ’.. వేణు మడికంటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది..
5. పసివాడి ప్రాణం..
అల్లు వంశీ, ఇతి ఆచార్య నటించగా.. థ్రిల్లింగ్ అంశాలతో ఎన్.ఎస్. మూర్తి తెరకెక్కించిన ‘పసివాడి ప్రాణం’ డిసెంబర్ 16న థియేటర్లలోకి రానుంది..
6. ఆక్రోశం..
తమిళ్‌తో పాటు తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకుంటున్న అరుణ్ విజయ్ నటించిన కోలీవుడ్ మూవీ ‘సినం’ తెలుగులో ‘ఆక్రోశం’ పేరుతో డబ్ అయి విడుదలవుతోంది.. పాలక్ లల్వానీ కథానాయిక.. జీఎన్ఆర్ కుమారవేలన్ డైరెక్టర్..
7. ది గుడ్ మహారాజా – (హిందీ)..
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్, నీతూ చంద్ర శ్రీవాత్సవ ప్రధాన పాత్రల్లో.. వికాష్ వర్మ డైరెక్ట్ చేసిన పీరియాడ్ డ్రామా.. ‘ది గుడ్ మహారాజా’ డిసెంబర్ 17న రాబోతుంది..
8. అజయ్ వర్ధన్ – (హిందీ)..
రోమిల్ చౌదరి, అర్జుమ్మాన్ ముఘల్, రుస్లాన్ ముంతాజ్, అహం శర్మ నటించిన ‘అజయ్ వర్ధన్’ డిసెంబర్ 16న రానుంది.. ప్రగతి అగర్వాల్ దర్శకత్వం వహించారు..
9. శంభో శివ శంకర్ – (కన్నడ)..
అభయ్ పునీత్, రక్షక్ నాయుడు, రోహిత్ నటించగా.. శంకర్ కోనమానహల్లి డైరెక్ట్ చేసిన ‘ శంభో శివ శంకర్’ డిసెంబర్ 16న రిలీజ్ అవుతుంది..
10. త్రాహిమాం – (హిందీ)..
పంకజ్ బెర్రీ, ఆర్షి ఖాన్, రాజు ఖేర్, ఆది ఇరానీ నటించగా.. ధష్యంత్ ప్రతాప్ డైరెక్ట్ చేసిన ‘త్రాహిమాం’ డిసెంబర్ 16న వస్తోంది..
11. మొదల మిడిత – (కన్నడ)..
నిమీష్ సాగర్, రష్మితా రోజా హీరో హీరోయిన్లుగా.. హరి చెతు దర్శకత్వం వహించిన లవ్ స్టోరీ ‘మొదల మిడిత’ డిసెంబర్ 16న రిలీజ్ కానుంది..
12. విక్టోరియా – (మరాఠీ)..
పుష్కర్ జాగ్, సోనాలీ కులకర్ణి, అక్షయ్ కులకర్ణి నటించగా.. విరజాస్ కులకర్ణి తెరకెక్కించిన ‘విక్టోరియా’ డిసెంబర్ 16న రిలీజ్ అవుతోంది..
13. నిన్గా (కన్నడ)..
రమేష్ భట్, సుధ బేలవాడి జంటగా నటించిన ‘నిన్గా’ డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది..
14. ధొండి చంప్య : ఏక్ ప్రేమ్ కథ – (మరాఠీ)
భరత్ జాదవ్, సాయిలీ పాటిల్, వైభవ్ మంగలే నటించిన ‘ధొండి చంప్య : ఏక్ ప్రేమ్ కథ’ డిసెంబర్ 16న విడుదల కానుంది.. ధ్యానేష్ బలేకర్ డైరెక్టర్..
15. టెంపర్ – (కన్నడ)..
ఆర్యన్ సూర్య బి. కాషీమా రఫీ జంటగా.. మంజు కవి తెరకెక్కించిన ‘టెంపర్’ డిసెంబర్ 16న విడుదల కానుంది..
16. గైరీ (మరాఠీ)..
పాండు రంగ జాదవ్ దర్శకత్వంలో.. నమ్రత గైక్వాడ్, మయూరేష్ పేమ్, ప్రణవ్ నటించిన ‘గైరీ’ డిసెంబర్ 16న విడుదలవుతోంది..
17. వామనన్ – (మలయాళం)
ఎ.బి. బినీల్ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ‘వామనన్’.. డిసెంబర్ 16న థియేటర్లలోకి రానుంది..
జీ5
హర హర మహాదేవ్ – (హిందీ) : డిసెంబర్ 12..
అనంత – ది ఎటెర్నల్ – (హిందీ) : డిసెంబర్ 16..
నెట్‌ఫ్లిక్స్..
కంగారు వాలీ – (ఇంగ్లీష్) : డిసెంబర్ 14..
బిలీవ్ ఇన్ శాంటా – (హిందీ) : డిసెంబర్ 14..
ది బిగ్ 4 – (చైనీస్) : డిసెంబర్ 15..
ప్రైవేట్ లెసన్ – (టర్కీ) : డిసెంబర్ 16..
కోడ్ నేమ్ : తిరంగ – (హిందీ) : డిసెంబర్ 16..
అరియిప్పు – (మలయాళం) : డిసెంబర్ 16..
ఇండియన్ ప్రిడేటర్ : బీస్ట్ ఆఫ్ బెంగుళూరు – (కన్నడ డాక్యుమెంటరీ) : డిసెంబర్ 16..
బార్డో, ఫాల్స్ క్రానికల్ ఆఫ్ ఎ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ ట్రూత్స్ – (ఇంగ్లీష్) : డిసెంబర్ 16..
ది రిక్రూట్ – (ఇంగ్లీష్) : డిసెంబర్ 16..
హాట్ స్టార్..
గోవింద నామ్ మేరా – (హిందీ) : డిసెంబర్ 16..
అమెజాన్ మినీ టీవీ..
ఫిజిక్స్ వాలా – (హిందీ) : డిసెంబర్ 15..
హొయిచోయ్..
కారాగార్ – 2 – (వెబ్ సిరీస్ – జపనీస్) : డిసెంబర్ 15..
ప్రైమ్ వీడియో..
నానీ – (ఇంగ్లీష్) : డిసెంబర్ 16..
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!