నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా(Dasara) . ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. నాని హీరోగా రూపొందిన తొలి పాన్ ఇండియా సినిమా ఇది. అంతేకాదు నాని కెరీర్ లోనే రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమా కూడా. మార్చ్ 30 న తెలుగుతో పాటు తమిళ , హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఏక కాలంలో విడుదల కాబోతోంది ఈ చిత్రం.
ధూమ్ దాం దోస్తాన్, చంకీల అనే పాటలకు సూపర్ రెస్పాన్స్ లభించింది. టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి 36 కట్లు చేసి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. ఓ పెద్ద సినిమాకి 36 సెన్సార్ కట్స్ అంటే మాటలు కాదు. ఆ విధంగా కూడా దసరా సినిమా ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఇక ఈ 36 సెన్సార్ కట్స్ న్యూస్ ను కూడా ప్రమోషన్ కు వాడేసుకుంటున్నాడు నాని.
‘ 36 సినిమా కట్ లు పడినంత మాత్రాన ఇది.. ఫ్యామిలీ ఆడియన్స్ చూడకూడని సినిమా అని కాదు. తెలంగాణాలో ఓ పదం ఉంది. బా*న్ చ*ద్ అని. ఆ పదం వినడానికి ఇబ్బందిగా ఉందని మ్యూట్ చేశారు. సినిమాలో ఆ పదం 24 సార్లు వస్తుంది. 36 కట్స్ లో 24 దానికే పడ్డాయి. సినిమా నేపథ్యం అలాంటిది కాబట్టి సహజత్వం లోపించకూడదు అనే ఉద్దేశంతో ఆ పదం వాడడం జరిగింది.
ప్రేక్షకులకు ఇబ్బందిగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ పదాన్ని మ్యూట్ చేశారు అంతే ‘ అంటూ చిత్ర బృందం అలాగే నాని నార్త్ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు.