Dasara: 36 లో 24 సెన్సార్ కట్స్.. ఆ బూతు పదం వల్లే పడ్డాయట!

నాని  హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా(Dasara) . ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. నాని హీరోగా రూపొందిన తొలి పాన్ ఇండియా సినిమా ఇది. అంతేకాదు నాని కెరీర్ లోనే రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమా కూడా. మార్చ్ 30 న తెలుగుతో పాటు తమిళ , హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఏక కాలంలో విడుదల కాబోతోంది ఈ చిత్రం.

ధూమ్ దాం దోస్తాన్, చంకీల అనే పాటలకు సూపర్ రెస్పాన్స్ లభించింది. టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి 36 కట్లు చేసి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు. ఓ పెద్ద సినిమాకి 36 సెన్సార్ కట్స్ అంటే మాటలు కాదు. ఆ విధంగా కూడా దసరా సినిమా ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఇక ఈ 36 సెన్సార్ కట్స్ న్యూస్ ను కూడా ప్రమోషన్ కు వాడేసుకుంటున్నాడు నాని.

‘ 36 సినిమా కట్ లు పడినంత మాత్రాన ఇది.. ఫ్యామిలీ ఆడియన్స్ చూడకూడని సినిమా అని కాదు. తెలంగాణాలో ఓ పదం ఉంది. బా*న్ చ*ద్ అని. ఆ పదం వినడానికి ఇబ్బందిగా ఉందని మ్యూట్ చేశారు. సినిమాలో ఆ పదం 24 సార్లు వస్తుంది. 36 కట్స్ లో 24 దానికే పడ్డాయి. సినిమా నేపథ్యం అలాంటిది కాబట్టి సహజత్వం లోపించకూడదు అనే ఉద్దేశంతో ఆ పదం వాడడం జరిగింది.

ప్రేక్షకులకు ఇబ్బందిగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ పదాన్ని మ్యూట్ చేశారు అంతే ‘ అంటూ చిత్ర బృందం అలాగే నాని నార్త్ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus