పైసా వసూల్ లో ఆకర్షించే అంశాలు

  • September 1, 2017 / 07:46 AM IST

గౌతమి పుత్ర శాతకర్ణి విజయం అందించిన ఉత్సాహంతో బాలకృష్ణ చేసిన సినిమా పైసావసూల్. ఇది తన మొదటి సినిమా అన్నంతగా కష్టపడ్డారు. ప్రకటించిన డేట్ కంటే 20 రోజుల ముందుగానే సినిమాని రిలీజ్ చేశారు. ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ అయిన పైసావసూల్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ప్రేక్షకులను ఆకర్షించే అంశాలు అనేకం ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి…

క్రేజీ కాంబినేషన్ బాలకృష్ణ కి వంద సినిమాల్లో నటించిన అనుభవం ఉంది. యువ హీరోలను స్టార్ హీరోలను చేసిన ఘనత పూరి జగన్నాథ్ సొంతం. వీరిద్దరూ సూపర్ స్పీడ్. ఈ కాంబినేషన్లో సినిమా అంటేనే క్రేజ్ ఏర్పడింది.

డిఫెరెంట్ లుక్ మాస్ అభిమానులకు నచ్చేలా కనిపించడం బాలకృష్ణ స్టైల్. ఆ స్టైల్ మార్చారు పూరి జగన్నాథ్. ఈ డిఫెరెంట్ లుక్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.

గ్యాంగ్ స్టర్ఫ్యాక్షన్ లీడర్ గా అలరించిన బాలయ్య.. పైసా వసూల్ ల్లో తొలిసారి గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. మాస్ హీరోకి బౌండరీలు లేకుంటే ఎలా ఉంటుందో ఇందులో చూడవచ్చు.

డైలాగ్స్ పూరి జగన్నాథ్ డైలాగ్స్ ఎలా ఉంటాయో ఆయన గత చిత్రాలు నిరూపించాయి. అతను రాసిన డైలాగ్స్ బాలకృష్ణ పలికితే .. ఆ మజానే వేరు.

బాలయ్య, శ్రీయ కెమిస్ట్రీ చెన్నకేశవ రెడ్డి తో గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో బాలయ్య, శ్రీయ మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. వారిద్దరు కలిసి నటిస్తున్న మూడో సినిమా మరింత వినోదాన్ని పంచుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus