స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సినిమాల ద్వారా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంస్థల్లో ‘యువసుధా ఆర్ట్స్’ ఒకటి. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ చిత్రాన్ని నిర్మించింది ఈ సంస్థే. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘దేవర 2’ కూడా ఉంటుందని రిలీజ్‌కు ముందే ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే క్లైమాక్స్‌లో లీడ్ కూడా ఇచ్చారు. కానీ, ఎందుకో ఈ ప్రాజెక్టు ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఓటీటీ రిలీజ్ తర్వాత ‘దేవర’కు నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది.
అందుకే ఎన్టీఆర్ ‘దేవర’ సీక్వెల్ చేయడానికి ఆసక్తి చూపడం లేదని ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలను ఎన్టీఆర్ ఖండించారు. కచ్చితంగా ‘దేవర 2’ ఉంటుందని స్పష్టం చేశారు. కానీ, ఆ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై మాత్రం స్పష్టతలేదు. ఆ విషయాలను పక్కన పెడితే.. ‘దేవర 2’ గురించి ఆలోచిస్తూ సమయం వృథా చేసుకోకుండా, కొరటాల శివ బాలకృష్ణతో ఓ సినిమాను సెట్ చేసుకున్నారు.
‘NBK112’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్టు మొదలైంది. ఈ చిత్రానికి కూడా ‘యువసుధా ఆర్ట్స్’ బ్యానర్‌పై మిక్కిలినేని సుధాకర్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ‘యువసుధా ఆర్ట్స్’ సంస్థ… మరోవైపు విశ్వక్ సేన్‌తో(Vishwak Sen) ఓ మిడ్-రేంజ్ ప్రాజెక్టును కూడా సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సైలెంట్‌గా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైపోయిందట. దర్శకుడు, నటీనటుల వివరాలు ఇంకా బయటకి రాలేదు. అయితే, ఈ ప్రాజెక్టును ఎందుకో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.