Sudeepa: సుదీప ఎలిమినేషన్ వెనుక అసలు కారణాలేంటంటే.?

బిగ్ బాస్ హౌస్ లో సుదీప జెర్నీ ముగిసింది. ఆరోవారం ఎలిమినేషన్స్ ప్రక్రియలో భాగంగా సుదీపని ఎలిమినేట్ చేశారు. నిజానికి బాలాదిత్య, రాజ్, సుదీప, ఇంకా మెరీనా నలుగురు డేంజర్ జోన్ లో ఉన్నారు.కానీ, సుదీప ఈవారం అనూహ్యంగా ఎలిమినేట్ అయిపోయింది. చాలామంది రాజ్ లేదా మెరీనా ఇద్దరిలో ఒకరు వెళ్లిపోతారని అనుకున్నారు. కానీ, సుదీప బిగ్ బాస్ హౌస్ నుంచీ వెళ్లిపోయింది. నిజానికి సుదీపకి నాలుగోవారమే ఎలిమినేషన్ గండం ఉంది. అయితే, అప్పుడు ఆరోహి వెళ్లిపోయింది. సుదీప మరికొన్ని వారాలు ఉండిపోయింది. అసలు సుదీప ఎలిమినేషన్ కి మనం కారణాలు చూసినట్లయితే.,

నెంబర్ 1

బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో వెనకబడిపోయింది. ఏ టాస్క్ లోనూ ఎగ్రెసివ్ పెర్ఫామన్స్ ఇవ్వలేదు. దాదాపు మూడు వారాలు గేమ్ ప్రారంభించలేదు. అందరూ దూసుకుని వెళ్లిపోతున్నా కూడా తను మాత్రం సైలంట్ గా ఉండిపోయింది. టాస్క్ లో పెర్ఫామన్స్ ఇవ్వకపోవడం వల్ల ఆడియన్స్ ని సంపాదించలేకపోయింది.

నెంబర్ 2

బిగ్ బాస్ హౌస్ లో కిచెన్ లోనే ఎక్కువశాతం గడిపింది సుదీప. రేషన్ మేనేజర్ గా ఉంటూ హౌస్ మేట్స్ అందర్నీ దూరం చేసుకుంది. ముఖ్యంగా బాసిజం చూపిస్తోందని, తనే కెప్టెన్ గా ఫీల్ అవుతోందని అనుకున్నారు హౌస్ మేట్స్. దీంతో హౌస్ మేట్స్ నుంచీ సుదీపకి వ్యతిరేకత వచ్చింది. నామినేషన్స్ లో ఎక్కువ ఓట్లు రావడానికి కారణం అయ్యింది.

నెంబర్ 3

ఐదో వారం నామినేషన్స్ జంటగా చేసినపుడు వాసంతీని నామినేషన్స్ కి పంపించి తను సేవ్ అయ్యింది. అక్కడ తను అనుకుంటున్న పాయింట్ ని స్ట్రాంగ్ గా చెప్పలేకపోయింది. ఇక ఆరోవారం నామినేషన్స్ లో వాదన పెట్టుకుంది. ఎంతసేపటికి ఒకే పాయింట్ పట్టుకుని బలంగా వాదించింది. ఆదిరెడ్డితో చేసిన ఆర్గ్యూమెంట్, గీతు తో చేసిన ఆర్గ్యూమెంట్ , రేవంత్ తో చేసిన ఆర్గ్యూమెంట్ లో బలం లేదు. అందుకే, సుదీపకి ఆడియన్స్ మద్దతు లభించలేదు.

నెంబర్ 4

సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో సుదీపకి పెద్దగా ఫాలోయింగ్ లేదు. హాట్ స్టార్ ఓటింగ్ చేసేది అంతా సోషల్ మీడియా వాల్లే అవ్వడం అనేది సుదీపకి మైనస్ అయ్యింది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్నవాళ్లు, తనకంటే తక్కువ గేమ్ ఆడినవాళ్లు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు. కానీ, సుదీప మాత్రం బిగ్ బాస్ హౌస్ ని ఆరోవారమే వదిలేయాల్సి వచ్చింది.

నెంబర్ 5

బిగ్ బాస్ హౌస్ లో తను అనుకున్న పాయింట్స్ ని గట్టిగా వాదించింది. అవతల వాళ్లని పట్టించుకోలేదు. అంతేకాదు, తన గ్రూప్ లో తనకి నచ్చినవాళ్లని బాగా వెనకేసుకుని వచ్చేది. మెరీనా, రోహిత్, చంటి, వాసంతీ, కీర్తి ఇలా కొంతమందితోనే గ్రూప్ గా ఉండిపోయింది. మిగతా వాళ్ల గేమ్ ని అబ్జర్వ్ చేయలేకపోయింది. ఇదే సుదీపకి మైనస్ అయ్యింది. ఏది ఏమైనా కూడా సుదీప బిగ్ బాస్ హౌస్ జెర్నీ ముగిసింది. నిజానికి ఆరువారాలు తనదైన స్టైల్లో తెలుగు ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేసింది. సినిమాల్లో పింకీగా గుర్తుపట్టే ఆడియన్స్ ఇప్పుడు సుదీపగా ఆదరించేలా చేసుకుంది. తను అనుకున్నది సాధించింది. అదీ మేటర్.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus