5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే
- September 25, 2026 / 07:39 AM ISTByPhani Kumar
నాగ చైతన్య, సాయి పల్లవి హీరో,హీరోయిన్లుగా తెరకెక్కిన మొదటి సినిమా ‘లవ్ స్టోరీ'(Love Story). శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2021 సెప్టెంబర్ 24న రిలీజ్ అయ్యింది. వాస్తవానికి ఈ చిత్రాన్ని మొదట కొంతమంది కొత్తవాళ్లతో సగం పోర్షన్ తీసేశారు. కానీ నిర్మాతలు ఇన్వాల్మెంట్ మేరకు నాగ చైతన్య, సాయి పల్లవి..లను తీసుకుని మళ్ళీ తీయడం జరిగింది. 2020 లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కోవిడ్ కారణంగా చాలా సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
Love Story
అయితే కోవిడ్ కారణంగా జనాలు థియేటర్ కి వస్తారా? రారా? అనే డౌట్ ఇండస్ట్రీలో చాలా మందికి ఉండేది. వారందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ ‘లవ్ స్టోరీ’ కోసం థియేటర్లకి భారీగా జనాలు తరలిరావడంతో ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి.

దానికి పాజిటివ్ టాక్ కూడా యాడ్ అవ్వడం వల్ల… బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించగలిగింది. ఈ సెప్టెంబర్ 24కి ‘లవ్ స్టోరీ’ రిలీజ్ అయ్యి 5 ఏళ్ళు పూర్తికావస్తున్న నేపధ్యంలో ఒకసారి బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 12.62 cr |
| సీడెడ్ | 4.50 cr |
| ఉత్తరాంధ్ర | 3.15 cr |
| ఈస్ట్ | 1.74 cr |
| వెస్ట్ | 1.48 cr |
| గుంటూరు | 1.59 cr |
| కృష్ణా | 1.50 cr |
| నెల్లూరు | 0.94 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 27.52 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.54 Cr |
| ఓవర్సీస్ | 5.10 Cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 35.16 cr |
‘లవ్ స్టోరీ’ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ చిత్రం ఏకంగా రూ.35.16 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకు ఈ సినిమా రూ.3.16 కోట్ల లాభాలు అందించి క్లీన్ హిట్ అనిపించుకుంది.












