Ravi Krishna: 18 ఏళ్ళ తర్వాత కలిసి కనిపించిన 7/జి పెయిర్.. వైరల్ అవుతున్న పిక్!

కల్ట్ క్లాసిక్, కల్ట్ బ్లాక్ బస్టర్.. అని ఇప్పుడు ఏవేవో సినిమాలను అంటున్నారు కానీ.. అసలైన కల్ట్ బ్లాక్ బస్టర్ ‘7 / జి బృందావన కాలనీ’ సినిమా అని చెప్పాలి. 18 ఏళ్ళ క్రితం అంటే 2004 అక్టోబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయాలను నమోదు చేసింది. ఈ సినిమాలో హీరో ఓ మూర్ఖుడిగా కనిపిస్తాడు. హీరోయిన్ ను.. మొదటి నుండి కామంతోనే చూస్తాడు.

కానీ ఆమెతో పడక సుఖం పొందినా.. మోజు తీరిపోయింది కదా అని వదిలేయడు. ఆమె చనిపోయాక కూడా ఆమెనే ప్రేమిస్తూ ఉంటాడు. ఇలాంటి కథతో అప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఆ తర్వాత కూడా మరో సినిమా రాలేదు అని చెప్పాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో తండ్రి, కొడుకుల మధ్య ఉండే భావోద్వేగాలను కూడా ఈ మూవీలో చక్కగా చూపించారు.ఈ సినిమాలో హీరోగా నటించిన రవి కృష్ణ.. స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం కొడుకు అనే సంగతి తెలిసిందే.

‘7 /జి బృందావన కాలనీ’ చిత్రంతో ఇతను తెలుగులో కూడా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇతనితో సమానంగా హీరోయిన్ కి కూడా మంచి ఇమేజ్ దక్కింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ ఇద్దరికీ సక్సెస్ లు దొరకలేదు. చాలా గ్యాప్ తర్వాత వీళ్ళు కెమెరాకి చిక్కారు. వీళ్ళ లేటెస్ట్ పిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇందులో హీరో రవి కృష్ణ (Ravi Krishna) గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు అని చెప్పాలి.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus