Sonu Sood: సోనూసూద్ వెనుక 80లక్షల మంది!

  • June 20, 2021 / 06:42 PM IST

బాలీవుడ్ నటుడు సోనూసూద్ రియల్ హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. నటుడిగా కంటే కూడా అతను చేసిన మంచి పనుల వలనే భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. గత ఏడాది ఎప్పుడైతే లాక్ డౌన్ మొదలైందో అప్పటి నుంచి కూడా సోనూసూద్ తన సహాయలను కంటిన్యూ చేస్తున్నాడు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా అవసరమైనంత మేరకు తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తున్నాడు.

ఎక్కువగా ట్విట్టర్ ద్వారానే సహాయలు అందించారు. సోనూసూద్ చేస్తున్న పనులకు కేవలం జనాలు మాత్రమే కాకుండా సినీ తారలు కూడా అతనికి అభిమానులుగా మారిపోతున్నారు. కొందరైతే సోనూసూద్ కు మద్దతు ఇస్తూ వారి తరపు నుంచి కూడా విరాళాలు అందిస్తున్నారు. ఇక ఇటీవల ఆక్సిజన్ ప్లాంట్స్ నిర్మించడంతో కూడా సోనూసూద్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటీవల ట్విట్టర్ లో 8 మిలీయన్ల ఫాలోవర్స్ మార్క్ ను కూడా అందుకున్నడు. ఒక విధంగా సోనూసూద్ సహాయం కోసం ట్విట్టర్ లో అప్పటికప్పుడు జాయిన్ అయినవారు కూడా ఉన్నారు.

తన వరకు కష్టమని వచ్చిన వారికి సోనూసూద్ ఏ మాత్రం లేదనకుండా కాదనకుండా సహాయం చేస్తున్నాడు. ప్రభుత్వం రాజకీయనాయకులు చేయాల్సిన పనులను సోనూసూద్ చేస్తున్న విధానానికి చాలామంది అతను రాజకీయాల్లోకి వస్తే బావుంటుందని అంటున్నారు. అయితే సోనూసూద్ మాత్రం ఇప్పట్లో తాను రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో లేనని చెప్పాడు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus