‘అ..ఆ’ ఆ మైలు రాయిని దాటింది..!!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పెన్ పవర్ కు తిరుగు లేదని ‘అ..ఆ’ చిత్రం నిరూపించింది. నితిన్, సమంతలతో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన వారంలోనే పెట్టుబడిని రాబట్టి రికార్డ్ సృష్టించింది.
ఇప్పుడు మరో మైలు రాయిని దాటింది.

స్టార్ హీరోల సినిమాలకే సొంతమైన 50 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. జూన్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా కుటుంబ కథా చిత్రంగా పేరు తెచ్చుకుని కలక్షన్ల వర్షం కురిపించింది. నెల రోజులోపే 50 కోట్లు వసూలు చేసి సత్తా చాటుకుంది. విదేశాల్లోనూ ‘అ..ఆ’ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకు పోతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus