పవన్ ను దాటేసిన నితిన్..!

నితిన్, సమంతలు జంటగా నటించిన చిత్రం ‘అ..ఆ’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రం ఓవర్సీస్ లో కలెక్షన్లలో దూసుకు పోతోంది. ఈ చిత్రం ఇప్పటి వరకు రెండు మిలియన్ డాలర్లను వసూలు చేసినట్లు చిత్ర బృందం పేర్కొంది.

తద్వారా ఈ చిత్రం ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది ($1.896 మిలియన్) చిత్ర కలెక్షన్లను అధిగమించడమే కాకుండా ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ చిత్రం కంటే ముందు బాహుబలి ($6.9మిలియన్), శ్రీమంతుడు ($2.9 మిలియన్), నాన్నకు ప్రేమతో($2.2 మిలియన్) చిత్రాలు ఉన్నాయి.

ఈ చిత్ర కలెక్షన్లు ఇలాగే కొనసాగితే త్వరలోనే ఈ చిత్రం $2.5 మిలియన్ మార్క్ ను అందుకునే అవకాశం లేకపోలేదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాధా కృష్ణ నిర్మించిన ఈ చిత్ర ఓవర్సీస్ హక్కులను బ్లూస్కై సినిమాస్ వారు సొంతం కొనుగోలు చేశారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus