మెహబూబ్ ఎలిమినేషన్‌తో లాస్ట్ వీకెండ్ ఎమోషనల్‌గా ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వారం మాత్రం బిగ్‌బాస్ పెట్టిన పుల్ల కారణంగా బిబి హౌస్‌లో ఎలిమినేషన్స్ హాట్‌హాట్‌గా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు బిగ్‌బాస్ హౌస్ జర్నీలో వరెస్ట్ పెర్ఫామెన్స్ ఎవరు అనే పాయింట్‌తో మొదలైన నామినేషన్ ప్రక్రియ రచ్చ లేపుతోంది. అగ్నికి ఆజ్యం పోసేందుకు ఎల్లప్పుడు ముందుండే బిగ్‌బాస్ ఈసారి ఏకంగా మిత్రులే శత్రువులుగా మారేలా చేసేలా చేయడంలో సక్సెస్ అయ్యారు.
ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే.. తాజా నామినేషన్స్ ప్రక్రియకు సంబంధించి విడుదల అయిన ప్రోమోలు చూస్తుంటే ఈసారి ఎడిటర్ల పనితనం కంటే బిగ్స్వామి వేసిన స్కెచ్ ప్రోగ్రామ్ చూసే వీక్షకుల్లో ఉత్కంఠం రేపేలా ఉంది. తొలి ప్రోమో చూస్తే మోనాల్ అండ్ అవినాష్‌ల మధ్య చిన్నపాటి ఆర్గ్యుమెంట్, అరియాన అండ్ లాస్యల మధ్య కాంపిటీషన్ ఇష్యూ, సోహైల్ అండ్ హారికల మధ్య వేస్ట్‌గాడు ఇష్యూ, అభిజిత్ అండ్ సొహైల్ మధ్య ఊతపదం ఇష్యూ ఇలా నామినేషన్స్‌లో భాగంగా ఒకరి పై ఒకరు మాటల తూటాలు పేల్చారు.
మరో ప్రోమోలో అఖిల్ అండ్ అభిజిత్‌ల మధ్య ఇష్యూను మాత్రమే చూపించారు. నామినేషన్లో బాగంగా వీరిద్దరి మధ్య మాటలు తార స్థాయికి చేరుకున్నాయి. మేక – పులి పిట్ట కథతో అభిజిత్‌ను అఖిల్ నామినేట్ చేయగా, అభి కూడా కౌంటర్ గట్టిగానే ఇచ్చాడు. గతంలో మోనాల్ విషయంలో శత్రువులుగా మారిన ఇద్దరు ఇటీవల మళ్ళీ మిత్రులు అయ్యారు. దీంతో ఏ రిలేషన్ అయినా సాఫీగా సాగుతుంటే బిగ్‌బాస్ ఎందుకు ఊరుకుంటాడు.. అసలే మాసాల లేదని భావిస్తున్న క్రమంలో కరెక్ట్ టైమ్ చూసి పెద్ద పుల్లే పెట్టాడు.
అఖిల్‌ను ఎలిమినేషన్ పేరుతో సీక్రెట్ రూమ్‌కి పంపిన బిగ్‌బాస్ తన గురించి హౌస్మేట్స్ ఏమనుకుంటున్నారో మొత్తం సినిమా చూపించి అఖిల్ మైండ్‌బ్లాక్ అయ్యేలా చేశాడు. మిత్రులుగా మారుతున్న వేళ బిగ్‌సామి తన స్కెచ్‌తో బద్ధ శత్రువుల్లా మార్చాడు. దీంతో నామినేషన్స్‌లో భాగంగా ఇద్దరి మధ్య మాటలు ఓ రేంజ్లో పేలాయి. అభి అయితే అఖిల్‌ను ఏకంగా బచ్చాగాడు అన్నాడంటే అక్కడ సిట్యువేషన్ ఎంత హాట్‌గా మారిందో అర్ధం చేసుకోవచ్చు. ఏది ఏమైనా బిగ్‌బాస్ హౌస్‌లో రిలేషన్స్ గతంలోలా ఫ్రెండ్లీగా ఉండే పరిస్థితి మాత్రం లేదనిపిస్తోంది. కాస్త లేటుగా అయిన పెద్ద యజమాని ముట్టించిన అగ్గిపుల్ల కొంపలో పెద్ద ఎత్తున మంట లేపిందని సర్వత్రా చర్చించుకుంటున్నారు.
Most Recommended Video
‘కమిట్ మెంటల్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?