సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమా రెండు పార్టులుగా తెరకెక్కనుందని వార్తలు వైరల్ కాగా బన్నీ ఫ్యాన్స్ లో చాలామంది ఆ వార్తలను నమ్మలేదు. కానీ పుష్ప సినిమా నిర్మాతలు క్లారిటీ ఇవ్వడంతో పుష్ప మూవీ రెండు పార్టులుగా తెరకెక్కనుందని కన్ఫామ్ అయింది. ఇప్పటికే పుష్ప పార్ట్ 1 షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా కరోనా విజృంభణ తగ్గితే ఆగష్టు 13వ తేదీనే ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి.
పుష్ప పార్ట్1 లో బన్నీకి విలన్ గా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. సరైన విలన్ దొరకకపోవడం వల్లే పుష్ప పార్ట్1 షూటింగ్ ఆలస్యమైన సంగతి తెలిసిందే. అయితే ఫహద్ ఫాజిల్ రోల్ మొదటి భాగానికి మాత్రమే పరిమితమని పార్ట్2 కోసం మరో విలన్ ను వెతికే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. పుష్ప పార్ట్1 లో ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్న బన్నీ పార్ట్2 లో మాత్రం స్టైలిష్ గా కనిపిస్తారని తెలుస్తోంది.
దాదాపు 225 కోట్ల రూపాయల బడ్జెట్ తో పుష్ప సినిమా తెరకెక్కనుందని సమాచారం. బన్నీకి ధీటైన రెండో విలన్ ను వెతకడమే ప్రస్తుతం పుష్ప సినిమాకు అసలు సమస్య అని తెలుస్తోంది. బాహుబలిలా రెండు పార్టులుగా పుష్ప సినిమా తెరకెక్కుతుండగా కలెక్షన్లపరంగా ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పుష్ప సినిమాతో బన్నీ పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకోవాలని భావిస్తుండగా బన్నీ కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది.