జోనర్ ఏదైనా…నేపథ్యం ఏమైనా లోతుల్లోకి వెళ్లి చూపించడం దర్శకుడు కృష్ణ వంశీ ప్రత్యేకత. అందుకే ఆయన సినిమాలలో ఎమోషన్స్ పీక్స్ లో ఉంటాయి. సన్నివేశాలు చూసే ప్రేక్షకుడుకి ఉత్కంఠ మరియు నిజంగానే జరుగుతుందా అనే భావన కలిగింప చేస్తాడు. ఆయన తెరకెక్కించిన చిత్రాలలో అంతఃపురం అలాంటి కోవలోకే వస్తుంది. ఆ సినిమాకు కథ, అందులోని పాత్రలే హీరోలు. ప్రత్యేకంగా ఓ హీరో అంటూ లేకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి దగ్గరగా కృష్ణ వంశీ తెరకెక్కించారు. రాయలసీమ కరుడుగట్టిన ఫ్యాక్షనిజాన్ని అంత గొప్పగా ఎవరు తెరకెక్కించలేదు.
పగ తరువాతే మనిషి, మారణహోమం అవరసరం అన్నట్లు ఆ సినిమా ఉంటుంది. ఫ్యాక్షన్ లీడర్ ఊరి పెద్ద నరసింహులు పాత్రలో ప్రకాష్ రాజ్ నటన శిఖరం అని చెప్పాలి. ఈ సినిమాకు ఆయన నేషనల్ ఫిలిం అవార్డ్స్ నందు స్పెషల్ జ్యూరీలో అవార్డు గెలుచుకున్నారు. ఆ తరువాత వచ్చిన ఫ్యాక్షన్ సినిమాలకు అంతఃపురం ఒక రిఫరెన్స్ గా మిగిలింది. ఈ సినిమాలో మరో ప్రధాన పాత్ర సౌందర్యదే. పట్టణంలో గారాభంగా పెరిగిన యువతీ ,అనుకోకుండా ఫ్యాక్షన్ ఉచ్చులో చిక్కుకుంటే..భర్తను కోల్పోయి, కొడుకు ప్రాణాలు, తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం చేసే పోరాటం, వేదన ఆమె నటనలో చక్కగా పలికించారు.
ఈ సినిమాలో నటనకు ఆమె ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. సౌందర్య భర్తగా సాయి కుమార్, సారాయి వీర్రాజు పాత్రలో జగపతి ఈ సినిమాకు సపోర్ట్ ఇచ్చారు. అనేక అవార్డ్స్ రివార్డ్స్ అందుకున్న ఈ మూవీ 1998 నవంబర్ 30న విడుదలైంది. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో తీసినదే ఆ ఫోటో. ప్రకాష్ రాజ్ తన మీసాన్ని సౌందర్యకు పెడుతుండగా పక్కనే ఉన్న దర్శకుడు కృష్ణ వంశీ నవ్వులు చిందించారు. ఈ మూవీ విడుదలైన ఆరేళ్లకు 2004 ఏప్రిల్ 17న ఆమె ప్రమాదంలో మరణించారు.
Most Recommended Video
అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!