‘బాహుబలి’ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ తో సినిమాలు చెయ్యాలని బడా నిర్మాతలే కోట్లకు కోట్లు అడ్వాన్స్ లు ఇచ్చెయ్యడానికి రెడీ అవుతున్నారు. మరి అలాంటి హీరో సినిమాలో చిన్న పాత్రైనా చెయ్యాలని ఏ నటులకి మాత్రం ఉండదు. కేవలం నటులకు మాత్రమేనా.. సామాన్యులకు ఉండదా? అంటే డబుల్ ఉంటుంది అనే చెప్పాలి. దానినే కొంతమంది మోసగాళ్లు క్యాష్ చేసుకుని పరారైపోయారు. వివరాల్లోకి వెళితే.. ప్రభాస్ సినిమాలో నటించడానికి నటీనటులు కావాలని..
ఇంట్రెస్ట్ ఉన్నవారు రిజిస్టర్ చేసుకోవాలంటూ ఓ ముఠా కొందరిని టార్గెట్ చేసింది. విదేశాల్లో షూటింగ్ అంటూ ఓ ప్రొడక్షన్ కంపెనీ పేరు చెప్పి రంగంలోకి దిగారు. ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ఇంకేముంది ప్రభాస్ సినిమా అనేసరికి.. చాలా మంది ఔత్సాహికులు డబ్బులు చెల్లించి తమ పేరుని రిజిస్టర్ చేయించుకున్నారు. కొన్ని రోజుల్లో ఆ కంపెనీ నుండీ మెసేజ్ లేదా ఫోన్ వస్తుందని, మీరంతా రెడీగా ఉండాలని ఆ యూనిట్ మెంబర్స్ మభ్యపెట్టారట.
డబ్బులు చెల్లించినవాళ్లంతా ఎన్ని రోజులైనా మెసేజ్ రాకపోవడంతో.. ప్రొడక్షన్ హౌస్‌కి వెళ్లారు.అక్కడ ఆరా తీస్తే.. వాళ్ళు మోసపోయినట్టు గ్రహించారు. చేసేదేమి లేక పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇదంతా జరిగింది హైదరాబాద్ లో అనుకుంటే పొరపాటే.. ముంబైలో జరిగింది.మోసపోయిన వారు ఒక్కొక్కరు 5 వేల నుండీ 10వేల వరకూ చెల్లించారట.
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!