దాదాపు పదేళ్ల కాలం క్రితమే తెలుగు బుల్లితెరపై పదుల సంఖ్యలో లేడీ యాంకర్లు సందడి చేశారు. కానీ, ఇప్పుడు వాళ్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో ప్రస్తుతం ముగ్గురు నలుగురు బ్యూటీలు మాత్రమే హోస్టులుగా చేస్తున్నారు. అందులో హాట్ లేడీ రష్మీ గౌతమ్ ఒకరు. వాస్తవానికి నటిగానే కెరీర్‌ను మొదలు పెట్టిన ఈ చిన్నది.. యాంకర్‌గా మారిన తర్వాతనే ఫేమస్ అయింది. దీంతో దశాబ్ద కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతూనే ఉంది.
ప్రస్తుతం రష్మీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే రష్మీకి ఓ పొలిటికల్ లీడర్ ఆరు లక్షల విలువ చేసే బంగారు నగలను బహుమతిగా ఇచ్చాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది. నిజానికి.. మొదటి నుంచి రష్మీకి సంబంధించిన వార్తలంటూ జనాలకు చాలా ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ రాజకీయ నాయకుడు ఆమెకు బంగారం బహుమతి ఇవ్వడంతో ఈ న్యూస్ జెట్ స్పీడ్ కంటే వేగంగా వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ రష్మీ తాజాగా ఓ పాపులర్ జ్యుయలరీ షాపుకు వెళ్లిందట. ఆ షాపులో ఆమె దాదాపు అక్కడ ఆరు లక్షలు విలువ చేసే బంగారం, తదితర ఆభరణాలు కొనుగోలు చేసిందట. కానీ అక్కడ బిల్లు మాత్రం తాను కట్టలేదట. ఆ బిల్లును ఓ ప్రముఖ పొలిటికల్ లీడర్ సదరు జ్యుయలరీ షాప్ వాళ్లకు ఆన్ లైన్లో ట్రాన్స్ ఫర్ చేశారట. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా నోరెళ్ల బెట్టి చూస్తుండిపోయారట.
ఆయన ఓ బడా రాజకీయ నాయకుడు కావడంతో ఈ న్యూస్ హాట్ కేక్ లా ట్రెండ్ అవుతోంది. అసలు ఆ పొలిటికల్ లీడర్ కు యాంకర్ రష్మీకి పరిచయం ఎక్కడైంది. వారిద్దకి అసలు సంబంధం ఏంటి..? ఆమెకోసం ఆయన ఎందుకు అంత ఖర్చు చేసి నగలు కొనిచ్చాడు ..? అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. అయితే ఇదంతా నిజమా ..? కాదా ..? కావాలని రష్మి పై ఉన్న కోపంతో ఇలాంటి వార్త పుట్టించారా.. నిజం ఏంటో తెలియాలంటే మాత్రం (Rashmi Gautam) రష్మీ స్పందించాల్సిందే.