ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ బాహుబలి చిత్రం గురించి మాట్లాడారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన “చెలియా” ఆడియో రిలీజ్ వేడుక వైభవంగా జరిగింది. ఈ ఫంక్షన్ లో రెహ్మాన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా మారారు. ఈ చిత్రానికి ఆయనే సంగీతం అందించారు. వేదికపై ఆయన మాట్లాడుతూ “ప్రతి సంవత్సరం బహుబలి వంటి చిత్రాలను రూపొందిస్తే తెలుగు సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఓ ఇమేజ్ లభిస్తుంది” అని వెల్లడించారు. రెహ్మాన్ బాహుబలి గురించి ప్రస్తావించడంతో అక్కడికి వచ్చిన అతిథులు చప్పట్లతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి వెండితెరపై ఆవిష్కరించిన బాహుబలి బిగినింగ్ తెలుగు సినిమాలకు అంతర్జాతీయ గుర్తింపును తీసికొచ్చింది. ఆ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ టాలీవుడ్ పవర్ ని మరో మారు ప్రపంచానికి చాటనుంది. ప్రభాస్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం ఏప్రిల్ 28 రిలీజ్ కావడానికి సిద్ధమవుతోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.