Nassar: కొడుకు బతికి ఉన్నా జీవచ్ఛవమేనా..!

  • September 28, 2023 / 08:23 PM IST

ప్రతి మనిషి జీవితంలో సుఖాలు ఎలా ఉంటాయో కష్టాలు కూడా అలానే ఉంటాయి. సినీ సెలబ్రిటీల జీవితాలు పైకి వెలుగుతూ కనిపించినా వాటి వెనుక చీకటి కోణాలు చాలానే ఉంటాయి. నాజర్ జీవితంలో కూడా అలాంటి ఒక విషాదం చోటుచేసుకుంది. అయితే ఇప్పటివరకు నాజర్ ఇంట్లో జరిగిన విషాదం గురించి చాలా తక్కువమందికే తెలుసు. నాజర్ కు ముగ్గురు కొడుకులు. నూరుల్ హజన్, లుఫ్తీన్, అబి మెహ్తీ హసన్. వీరిలో పెద్ద కొడుకు తప్ప.. ఇద్దరు కొడుకులను నాజర్ హీరోలుగా చేశాడు.

ప్రస్తుతం వారు నటులుగా కొనసాగుతున్నారు. ఇక నాజర్ (Nassar) పెద్ద కొడుకు విషయంలోనే విషాదం చోటుచేసుకుంది. నూరుల్ హజన్ అలియాస్ అబ్దుల్ ఫైజల్ హాసన్. చిన్నతనం నుంచి తండ్రిని చూస్తూ పెరిగి .. హీరోగా మారాలనుకున్నాడు. కొడుకు కోరికను నాజర్ కాదనలేదు. అన్ని అనుకోని హీరోగా లాంచ్ చేసే ఏడాదే.. అతనికి పెద్ద కారు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో అబ్దుల్ తీవ్రంగా గాయపడ్డాడు. నిజం చెప్పాలంటే జీవచ్ఛవంలా మారిపోయాడు.

గతం గుర్తు లేదు.. సొంత తల్లి దండ్రులను కూడా గుర్తుపట్టలేని స్థితి. తల్లిదండ్రులకు అంతకు మించిన నరకం మరొకటి ఉండదు అనే చెప్పాలి. అయినా కొడుకు ప్రాణాలతో ఉన్నాడు అని నాజర్ కుటుంబం సంతోష పడింది. 2014 లో జరిగిన ఈ ప్రమాదం నాజర్ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా జీవచ్ఛవంలా మారడం చూసి నాజర్ కృంగిపోయాడు.

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు అబ్దుల్ ను వారు చిన్న పిల్లాడిలా చూసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. అబ్దుల్ కు ఎవరు గుర్తులేకపోయినా హీరో విజయ్ మాత్రం గుర్తు ఉన్నాడు. ఆయన కనిపిస్తే ఆనందంతో ఎగిరి గంతులు వేస్తాడట.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus