Pallavi Prashanth: ఆ దేవుడికి మొక్కడం వల్లే పల్లవి అనే పేరును పెట్టుకున్నాడా?

  • December 18, 2023 / 08:05 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలుచుకున్న సంగతి మనకు తెలిసిందే. కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా ఈయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పల్లవి ప్రశాంత్ మొదటి నుంచి కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఆట తీరని కనబరిచారు కానీ కొందరు ఈయన సింపతి డ్రామాలు ఆడుతున్నారు అంటూ కూడా కామెంట్లు చేశారు. ఇలా మొదటి నుంచి కూడా ఫిజికల్ టాస్కులలో ఎంతో అద్భుతమైనటువంటి ఆటతీరును కనబరిస్తూ ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ చివరికి విన్నర్ కావడంతో ఈయనకు సంబంధించి ఎన్నో విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే చాలామంది పల్లవి ప్రశాంత్ అనే పేరు గురించి ఎన్నో సందేహాలు వ్యక్తం చేశార. ఈయనకు పెళ్లి జరిగిందా తన భార్య పేరును తన పేరుకు ముందు పెట్టుకున్నారా అంటూ సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇక తనకు పెళ్లి కాలేదని అయితే తన పేరు ముందు పల్లవి అని పెట్టుకోవడానికి కారణం ఉందని తెలుస్తుంది. పల్లవి ప్రశాంత్ అసలు పేరు పల్లవి రాజు.

పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) తల్లితండ్రులు తమకు కొడుకు పుట్టాలని వారి గ్రామంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి పల్లవి రాజు అనే దేవుడికి మొక్కుకున్నారట. ఇలా ఆ స్వామివారికి మొక్కటం వల్లే తమకు కొడుకు పుట్టారని ఆయన తల్లిదండ్రులు తనకు పల్లవి రాజు అనే పేరు పెట్టారు. ఇలా పల్లవి రాజుగా ఉన్నటువంటి తన పేరు కాస్త పల్లవి ప్రశాంత్ గా మార్చుకున్నారు.

అలా దేవుడికి మొక్కిన మ్రొక్కు కారణంగానే ఈయన తన పేరు ముందు పల్లవి అనే పెట్టుకోవాల్సి వచ్చిందని తెలుస్తుంది. ఇలా బిగ్ బాస్ విన్నర్ గా ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నటువంటి పల్లవి ప్రశాంత్ ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుంటారా తన కెరియర్ ఎలాంటి మలుపులు తిరగబోతుంది అనేది తెలియాల్సి ఉంది.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus