Mahesh Babu: కెరీర్ విషయంలో మహేష్ ఇంత పెద్ద తప్పు చేశారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మహేష్ బాబు ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటుడు కావడంతో ఈయన నటించిన సినిమాలలో తన కుమారుడు మహేష్ బాబుని బాల నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలా బాల నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి మహేష్ బాబు అనంతరం సపోర్టింగ్ పాత్రలలో కూడా నటించారు.

అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి ఈయన వరుస సినిమాలో నటిస్తూ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రస్తుతం సూపర్ స్టార్ రేంజ్ సంపాదించుకున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మహేష్ బాబు తాను సినిమాలలో సంపాదించిన కొంత మొత్తాన్ని సామాజిక సేవ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.
ఇలా హీరోగా మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా నిజమైన హీరో అని తన మంచి మనసును చాటుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కెరియర్ లో ఎంత మంచి సక్సెస్ అయినటువంటి మహేష్ బాబు సర్దిద్దుకోలేని ఒక తప్పు చేశారని తెలుస్తోంది. మరి మహేష్ బాబు చేసినటువంటి ఆ తప్పు ఏంటి అనే విషయానికి వస్తే.. చిన్నప్పుడు మహేష్ బాబు చదువుకుంటూ తాను డాక్టర్ కావాలని కలలు కనే వారట.

తన తండ్రి కృష్ణ మాత్రం మేకప్ వేసుకొని సినిమా షూటింగ్లకు వెళ్లడం చూసినటువంటి మహేష్ బాబు తాను కూడా మేకప్ వేసుకొని షూటింగ్ ఎక్కువ వస్తానని అడిగారట. ఈ విధంగా తన తండ్రి చేసే సినిమాలను దగ్గరుండి చూసినటువంటి మహేష్ బాబుకి క్రమంగా సినిమాలలో నటించాలి అనే కోరిక పుట్టడంతో ఈయనని బాల నటుడిగా కృష్ణ పరిచయం చేశారు అలా ఆరోజు తీసుకున్నటువంటి నిర్ణయం మహేష్ కెరియర్ లో సరిదిద్దుకోలేని తప్పుగా మారిందని, తనకు సినిమాలలో నటించాలనే కోరిక కలగడంతో డాక్టర్ అవ్వాలనే కలని చంపేసుకున్నారని తెలుస్తోంది. డాక్టర్ అవ్వాల్సిన మహేష్ కాస్త యాక్టర్ గా మారిపోయినా ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తూ గొప్ప వ్యక్తిగా నిలిచిపోయారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus