టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఎందరో హీరోయిన్ లకు వివిధ సినిమాలలో మేకప్ వేస్తూ వచ్చిన ప్రముఖ మేకప్ మాన్ కడాలి చక్రవర్తి(చక్రి) గారు హైదరాబాద్ లోని పంజాగుట్టలో నూతనంగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” ప్రారంభించడం జరిగింది. గతంలో రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, కత్తి శెట్టి వంటి ఎందరో స్టార్ హీరోయిన్లకు మేకప్ మాన్ గా పనిచేసిన చక్రి గారు తానే సొంతంగా ప్రారంభించిన ఈ నూతన మేకప్ స్టూడియోను ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నాతో కొన్నేళ్లుగా ఉంటూ పనిచేసిన సోదర సమానులు చక్రి అన్న సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడమీ పేరిట తన సొంత మేకప్ స్టూడియోను ప్రారంభించారు. నా తొలి చిత్రం నుండి సుమారు 8 సంవత్సరాల పాటు మీరు చూసిన అన్ని సినిమాలకు నాకు మేకప్ చేసింది చక్రి అన్ననే. తను సొంతంగా ఒక మేకప్ అకాడమీ ప్రారంభించడం అనేది ఆయన కల. నేడు ఆ కల నెరవేరింది. భవిష్యత్తులో కూడా ఆయన ఎటువంటి బ్రాంచీలు మరెన్నో ప్రారంభించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తెలుగు భాష ఇంతగా రావడానికి కారణం చక్రి అన్న. ఆయనకు మేకప్ పట్ల ఉన్న నాలెడ్జ్ తో ఆయన మరింత ముందుకు వెళ్తారని అర్థమవుతుంది” అన్నారు.
ఈ సందర్భంగా మీడియా వారు అడిగిన ప్రశ్నలకు రకుల్ ప్రీత్ సింగ్ సమాధానం ఇస్తూ… “ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు చేయకపోవడం వల్ల నేను తెలుగు సినిమాలను, తెలుగువారిని ఎంతగానో మిస్ అవుతున్నాను. తప్పకుండా నేను తెలుగులో సినిమాలు చేస్తాను. నాకు తొలివిజయం అందించింది తెలుగు సినిమానే. నన్ను తెలుగు ప్రజలు అంతగా ఆదరించారు. ఒక చక్కటి కథ కోసం ఎదురుచూస్తున్నాను. నాకు మంచి తెలుగు కథ రావాలని నా అభిమానులంతా నాకోసం ప్రార్థించండి. హైదరాబాద్ లో ఉండి షూటింగ్ చేయాలని ఎంతోకొరికగా ఉంది. ప్రస్తుతం కథలు వింటున్నాను. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నాను. తెలుగులో బాహుబలి వంటి సినిమా చేయాలని నా కోరిక. బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో నేను గతంలో రెండు సినిమాలలో చేశాను. వారి మాస్ డైరెక్షన్ నాకు చాలా ఇష్టం. అఖండ తాండవం చిత్ర విజయానికి గాను బోయపాటి గారికి, బాలకృష్ణ గారికి నా శుభాకాంక్షలు” అన్నారు.
కడాలి చక్రవర్తి గారు మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. సాయం చేయడానికి ఎంతోమంది ఉంటారు కానీ రకుల్ ప్రీత్ గారు ఇంకా ముందుంటారు. 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆమెతో పని చేసేవారు అందరూ బాగుండాలని కుటుంబ సభ్యులు లాగా చూసుకుంటారు. టాలీవుడ్ లో పనిచేసిన అన్ని సినిమాలకు రకుల్ గారికి నేనే మేకప్ చేశాను. స్టాఫ్ ను ఆమె మార్చరు, కుటుంబ సభ్యుల కలపకుంటారు. మేకప్ స్టూడియో మీ కల. ఆ కల నెరవేరడానికి నేను అండగా ఉంటాను. మేకప్ స్టూడియో ఆమె ఉత్సాహంగా ముందుకు వచ్చారు. మరొకసారి రకుల్ ప్రీత్ సింగ్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అన్నారు.
హైదరాబాద్ పంజాగుట్టలోని హిందీనగర్ ద్వారకాపురిలో ఎస్టీమ్ డైమండ్ నందు నూతనంగా ఈ సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడమీ ప్రారంభించడం జరిగింది.