అడివి శేష్ టాలీవుడ్ జేమ్స్ బాండ్ టైపు. తక్కువ బడ్జెట్లో యాక్షన్ సినిమాలు తీసి భారీ బ్లాక్ బస్టర్స్ కొట్టడం ఇతనికి అలవాటు.’మేజర్’ వంటి పాన్ ఇండియా హిట్ ఇతని ఖాతాలో ఉంది. అలాగే వరుసగా 6 హిట్లు కొట్టాడు. త్వరలో ‘డెకాయిట్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి షానియెల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు.
అనురాగ్ కశ్యప్, సునీల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో అత్యంత కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా నుండి గ్లిమ్ప్స్ వదిలారు.దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టీజర్ వదిలారు. దీంతో కథపై కొంత హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
లవర్స్ అయినటువంటి అడివి శేష్, మృణాల్ ఠాకూర్ తర్వాత దొంగలుగా మారి ఒకానొక పరిస్థితిలో ఎదురుపడటం.. తర్వాత ఓ భారీ దొంగతనం కోసం ప్రయత్నించడం.. ఈ క్రమంలో వచ్చిన యాక్షన్ సన్నివేశాలు హైలెట్ అయ్యేలా ఉన్నాయి. అడవి శేష్ శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ మాస్ గా కనిపించాడు. బాడీ లాంగ్వేజ్ తప్ప గెటప్ తన గత సినిమాల్లో లానే ఉంది.
మృణాల్ ఠాకూర్ యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా నటించడం కొత్తగా అనిపిస్తుంది. ఈ టీజర్లో నాగార్జున ‘కన్నె పిట్టరో’ సాంగ్ ని ఎక్కువగా వాడారు. బహుశా ఆ పాటని రీమిక్స్ కూడా చేసి ఉండొచ్చు. చివర్లో ఆ పాటని అనురాగ్ కశ్యప్ పాడటం ఫన్నీ గా అనిపించింది. టీజర్ కి లాస్ట్ షాట్ అదే. మీరు కూడా ఓ లుక్కేయండి :