ఆ తరం వాళ్లకు రెబల్ స్టార్ అనే వ్యక్తిని పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. అలాగే ఈ తరం వాళ్లకు ప్రభాస్ పెద్దనాన్న అంటే తెలియని వాళ్లు లేరు.. ఇటీవల కాలంలోనే కృష్ణంరాజు స్వర్గస్తులైన్నారు. కృష్ణంరాజు 1970-80లో 183 సినిమాలపైగా నటించారు. తరువాత రాజకీయాల్లోకి వెళ్లారు. అయితే సినిమా ఇండస్ట్రీ లో రూమర్స్ అనేవి సర్వసాధారణం, ఒక హీరో మరియు ఒక హీరోయిన్ కలిసి రెండు మూడు సినిమాల్లో నటిస్తే వాళ్ళిద్దరి మధ్య ఎదో ఉందని సినీ పరిశ్రమకి చెందిన కొందరు కథలు అల్లేస్తారు,వాటిని మీడియా విస్తృతంగా ప్రచారం చేసేది.
ఇది దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో జరుగుతున్నదే, అయితే గతం లో సోషల్ మీడియా లేకపోవడం వల్ల ఇప్పుడున్న స్థాయిలో రూమర్స్ ప్రచారం అయ్యేవి కావు. ఇప్పుడు ఒక రూమర్ వస్తే, దానిని వివిధ కోణాల్లో ఆలోచించి ఎవరికీ ఇష్టం వచ్చింది వాళ్ళు రాసేస్తుంటారు. ఎందుకంటే సోషల్ మీడియా లో వచ్చే రూమర్స్ కి వ్యూస్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. అయితే కొంతమంది సెలబ్రిటీస్ మన వల్ల నలుగురు బ్రతుకుతున్నారు, వాళ్లకి ఇష్టమొచ్చింది రాసుకొని అని చూసి చూడనట్టు ఉంటారు. కానీ కొంతమంది సెలబ్రిటీస్ మాత్రం మనసుకి తీసుకుంటారు, మీడియా ముందుకు వచ్చి స్పందిస్తారు, అలా అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో జరిగాయి.
ఇలాంటి సంఘటన రెబెల్ స్టార్ కృష్ణం రాజు (Krishnam Raju) విషయం లో కూడా జరిగిందట. కృష్ణం రాజు కెరీర్ ని మలుపుతిప్పిన చిత్రం ‘కృష్ణవేణి’. ఇందులో అలనాటి స్టార్ హీరోయిన్ వాణిశ్రీ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం లో వీళ్లిద్దరి పెయిర్ గ్రాండ్ సక్సెస్ అవ్వడం తో , కృష్ణం రాజు వాణిశ్రీ ని ఎక్కువగా తన సినిమాల్లో తీసుకునే వాడు. కృష్ణవేణి చిత్రం తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘భక్త కన్నప్ప’ కూడా ఒక చరిత్ర సృష్టించింది. అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో 8 సినిమాలు దాకా వచ్చాయి.
ఇక అప్పటి నుండి వీళ్లిద్దరి మధ్య ఎదో నడుస్తుంది, త్వరలో వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ మీడియా అప్పట్లో ఊదరగొట్టేసింది. విషయం కృష్ణం రాజు ఇంట్లో వాళ్లకి కూడా తెలియడం తో వాళ్ళు కూడా కృష్ణం రాజు ని అనుమానించారట.అప్పుడు కృష్ణం రాజు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా ఇద్దరి మధ్య ఏమి లేదు, మేము కేవలం మంచి స్నేహితులం మాత్రమే అని క్లారిటీ ఇచ్చాడట.ఇలా రూమర్స్ అప్పటి నుండే సెలెబ్రిటీలను చాలా ఇబ్బంది పెట్టేవి.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?